Anasuya Video: బోరున ఏడ్చేసిన అనసూయ, షాకైన నెటిజన్స్!

ఏదో ఒక పోస్ట్ పెట్టడం లేదా ట్వీట్ చేయడం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే అనసూయ మళ్లీ వార్తల్లో నిలిచింది.

Published By: HashtagU Telugu Desk
Anasuya

Anasuya

ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఆమధ్య విజయ్ దేవరకొండపై వ్యాఖ్యలు చేయడంతో విజయ్ అభిమానులు, అనసూయ సోషల్ మీడియాలో వాగ్వాదానికి దిగారు. ఇలా ఏదో ఒక పోస్ట్ పెట్టడం లేదా ట్వీట్ చేయడం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే అనసూయ మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె ఏడుస్తూ కనిపించింది. సోషల్ మీడియాలో తన సినిమాల గురించి, తన పర్సనల్ లైఫ్ గురించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులందరినీ పలకరించే అనసూయ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్.

తన ఏడుపు వీడియోతో పాటు లాంగ్ నోట్ కూడా రాసింది. ఆ నోట్‌లోని సారాంశం ఏమిటంటే.. సోషల్ మీడియా అనేది అందరికి కనెక్ట్ అయ్యే మార్గం. ఒకరి విషయాలు మరియు అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక వేదిక లాంటిది. ఇతరుల జీవన విధానం, సంస్కృతిని తెలుసుకోవడానికి మంచి ప్రదేశం. నేను అలా అనుకున్నాను, కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోయాను అని రియాక్ట్ అయ్యింది. ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు మరియు ఇతర వ్యక్తిగత విషయాలు అన్నీ తన జీవితంలో భాగమేనని చెప్పింది.

వాటన్నింటిని తన అభిమానులతో పంచుకుంటానని, అవన్నీ తన జీవితంలో, తను బలంగా ఉన్నప్పుడు, ఎప్పుడు విచ్ఛిన్నమైనా జరిగే సంఘటనలే అని చెప్పింది. తటస్థంగా ఉండటం లేదా దౌత్యం గురించి తనకు ఏమి తెలియదని అనసూయ చెప్పింది. అలాగే చివర్లో అందరినీ ప్రేమించమని చెప్పింది. ఇతరులను ద్వేషించకండి, ఎందుకంటే కొన్నిసార్లు చెడు రోజు ఉంటుంది. కాబట్టి ఇతరులపై కొంత ప్రేమను చూపండి. అలాగే చివర్లో నేను బాగానే ఉన్నాను. ఇది ఐదు రోజుల క్రితం రికార్డ్ చేయబడింది అని చెప్పింది. ప్రస్తుతం అనసూయ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Also Read: Fake Transgenders: నగరంలో నకిలీ ట్రాన్స్ జెండర్స్.. డబ్బులు దండుకుంటున్న బిహార్ ముఠా!

  Last Updated: 19 Aug 2023, 04:49 PM IST