Site icon HashtagU Telugu

Anasuya : అనసూయను దారుణమైన కామెంట్ చేసిన నెటిజన్.. రిప్లయ్ ఏం ఇచ్చిందంటే..!

anasuya slams a netizen

anasuya slams a netizen

హాట్ బ్యూటీ అనసూయ (Anasuya Bharadwaj) సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. నిత్యం ఫొటోస్ , వీడియోస్ తో పాటు అప్పుడప్పుడు కొటేషన్లు పెడుతూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. అప్పుడప్పుడు మాత్రం ఆమెకు నెటిజన్ల నుండి విమర్శలు , ట్రోల్స్ , వివాదస్పద కామెంట్స్ ఎదురవుతుంటాయి. కాస్త ఘాటుగా ఉంటె తప్ప వాటికీ రిప్లయ్ ఇవ్వదు. తాజాగా ఓ నెటిజన్ మాత్రం అనరాని మాట అని..ఆమెకు కోపం తెప్పించాడు.

అనసూయ..ఈ పేరు చెప్పిన..విన్న కానీ యూత్ లో కొంటె కోరికలు పుట్టుకొస్తాయి. ఇద్దరు పిల్లలకు తల్లైన కానీ హీరోయిన్ రేంజ్ గ్లామర్ అమ్మడి సొంతం. అందుకే అమ్మడికి యూత్ దగ్గరి నుండి పెద్దవారి వరకు అభిమానులు ఉన్నారు. అప్పుడెప్పుడో యాంకర్ గా అడుగుపెట్టి..ఆ తర్వాత జబర్దస్త్ షో (Jabardasth Show) తో తన జతకమే మార్చుకోవడమే కాదు బుల్లితెర యాంకర్లు ఇలా కూడా ఉంటారా అనిపించేలా చేసింది.

చీర కట్టులోనైనా , మోడ్రన్ డ్రెస్సులో నైనా అమ్మడి తర్వాతే ఎవరైనా అనేలా తన అందంతో కట్టిపడేయడం ఆమెకు చెల్లింది. కేవలం బుల్లితెర ఫై మాత్రమే కాదు వెండితెర ఫై రంగమ్మత్త గా పవర్ ఫుల్ రోల్ చేసి వెండితెర ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేనా సోషల్ మీడియా (Social Media) లో అయితే అమ్మడి గురించి ఎంత చెప్పిన తక్కువే..నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ , బికినీ షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇక వివాదాల్లో కూడా అమ్మడు తక్కువేం కాదు.

Read Also : Minister Suresh Dispute : నోరుజారే నేత‌ల జాబితాలోకి మంత్రి సురేష్‌

తాజాగా అనసూయ ఇన్ స్టాలో (Anasuya Instagram Account) తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ టాప్ లో హాట్ హాట్ గా క్లివేజ్ షోతో పోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టగానే బాగా వైరల్ అయ్యాయి. ఆమె అభిమానులు బోలెడన్ని కామెంట్లు పెట్టారు. పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగెటివ్ కామెంట్స్ కూడా పడ్డాయి. అయితే, ఓ నెటిజన్ ఏకంగా బూతు కామెంట్ పెట్టాడు. ‘లం..’ అంటూ తీవ్ర పదజాలాన్ని వాడాడు. ఈ కామెంట్ పై అనసూయ తీవ్రంగా స్పందించింది. “మీరు వాళ్లతోనే ఉంటున్నారనుకుంటాగా, బాగా తెలిసినట్టు చెప్తున్నారు.. పాపం వాళ్ల కష్టంతో పెరుగుతున్నారా?’’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.