Site icon HashtagU Telugu

Anasuya Bharadwaj: బోల్డ్ లుక్ లో అనసూయ.. రంగమ్మత్తకు మించి!

Anasuya1

Anasuya1

యాంకరింగ్ తో అదరగొట్టిన అనసూయ (Anasuya)  వరుస సినిమాలతో (Movies) మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. రంగస్థలం, ఫుష్ప సినిమాలో ఆకట్టుకున్న అనసూయ ఏ పాత్ర అయినా చేయగలదు అని నిరూపించింది. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ కొత్త కొత్త పాత్రల్లో నటిస్తోంది. తాజాగా అనసూయ (Anasuya) రో కొత్త పాత్రలో అభిమాలను అలరించబోతోంది. అనసూయ విమానంలో మూవీలో నటిస్తోంది. మే డే పురస్కరించుకుని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు, చీరకట్టి బోల్డ్ లుక్స్ లో దర్శనమిచ్చింది.

అనసూయ ఊర మాస్ గెటప్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అనసూయ లుక్ ఆమె గతంలో చేసిన రంగమ్మత్త పాత్రను తలపించింది. ఇండస్ట్రీ హిట్ రంగస్థలం మూవీ అనసూయ చేసిన పల్లెటూరి (Village) ఆంటీ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. నటిగా బ్రేక్ ఇచ్చింది. రంగస్థలం చిత్రం తర్వాత అనసూయ నటిగా బిజీ అయ్యారు. మరోసారి అనసూయ రంగమ్మత్త తరహా పాత్రలో అలరించనున్నారు. విమానం చిత్రానికి శివ ప్రసాద్ .వై దర్శకుడు. సముద్ర ఖని మరో ప్రధాన పాత్ర చేశారు. గాల్లో ఎగిరే విమానం చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ డ్రామాగా విమానం మూవీ తెరకెక్కింది. జూన్ 9న విమానం మూవీ విడుదల కానుంది. ఈ ప్రయోగాత్మక చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Also Read: Revanth Reddy: సెక్రటేరియట్ కు రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు!