Anasuya: కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. కారణం ఇదే..?

బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya) భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం 'రంగమార్తాండ' ప్రెస్ మీట్‌లో ఆమె కంటతడి పెట్టారు. సినిమా ఫైనల్ కాపీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Anasuya

Resizeimagesize (1280 X 720) (8) 11zon

బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya) భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం ‘రంగమార్తాండ’ ప్రెస్ మీట్‌లో ఆమె కంటతడి పెట్టారు. సినిమా ఫైనల్ కాపీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు. “సినిమా ప్రమోషన్స్ గురించి ఆందోళన చెందుతున్నప్పుడు నేను మా దర్శకుడు కృష్ణవంశీకి తరచూ ఫోన్ చేశా. సార్.. ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు? అని అడిగితే ‘మా సినిమా మాట్లాడుతుంది’ అని బదులిచ్చారు. ఈ క్షణం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ‘రంగమార్తాండ’ లాంటి గొప్ప సినిమాలో భాగమయ్యాను. ఇది చాలు నా జీవితానికి. సోమవారం సాయంత్రం ఈ సినిమా చూశాను. అక్కడే ఆగిపోయాను. ఓ సినిమాలో నటించాను.. అంత ఎమోషనల్‌గా ఉండదని భావించి ధైర్యం తెచ్చుకుని షోలో కూర్చున్నాను. కన్నీళ్లు ఆగలేదు. అందరూ తప్పక చూడాల్సిన చిత్రమిది” అని ఆమె అన్నారు.

ఇక ప్రస్తుతం యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా వస్తోందని సమాచారం.

Also Read: Nisha Desai Biswal: భారత సంతతి మహిళ నిషా దేశాయ్ బిస్వాల్‌కు కీలక బాధ్యతలు.. ఎవరీ నిషా దేశాయ్..?

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. మరాఠీలో మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’కి ఇది రీమేక్. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించగా, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఉగాది కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  Last Updated: 22 Mar 2023, 02:25 PM IST