Ananya Nagalla : రాముడి గుడి కట్టడం కోసం తాత పదేళ్ల పోరాటం.. హీరోయిన్‌తో గొడవ..

రాముడి గుడి కట్టడం కోసం తాత పదేళ్ల పోరాటం. గుడి నిర్మాణంలో హీరోయిన్‌ అనన్య నాగళ్లతో గొడవ. ఈ మోడరన్ ఏజ్ రామదాసు కథ మీకు తెలుసా..?

Published By: HashtagU Telugu Desk
Ananya Nagalla Shares A Interesting About Her Grand Father Built A Rama Temple

Ananya Nagalla Shares A Interesting About Her Grand Father Built A Rama Temple

Ananya Nagalla : తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల.. ఒక పక్క హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తూనే, మరికొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ ఆడియన్స్ ని నిత్యం పకరిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ‘తంత్ర’ అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి.. మంచి సక్సెస్ నే అందుకున్నారు. ప్రస్తుతం ‘పొట్టేలు’ అనే సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ హీరోయిన్ నేడు తన ఇన్‌స్టాగ్రామ్ ఆసక్తికర పోస్ట్ వేశారు.

నేడు (ఏప్రిల్ 17) శ్రీరామనవమి సందర్భంగా సెలబ్రిటీస్ అందరూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు వేస్తున్నారు. ఈక్రమంలోనే అనన్య కూడా ఓ మోడరన్ ఏజ్ రామదాసు గురించి చెబుతూ ఇంటరెస్టింగ్ పోస్ట్ వేశారు. గూడు లేని రాముడికి నిలయం కట్టడం కోసం రామదాసు కష్టపడిన కథ అందరికి తెలిసిందే. ఆ రామదాసు లాగానే అనన్య వాళ్ళ తాత కూడా రాముడికి గుడి కట్టేందుకు పదేళ్ల పాటు కష్టపడుతున్నారట.

75 ఏళ్ళ అనన్య తాత.. గత పదేళ్ల నుంచి వాళ్ళ ఊరిలో రాముడి గుడి కట్టడం కోసమా కాస్త పడుతున్నారట. ఈ గుడి కట్టడం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఈ విషయంలో అనన్య కూడా ఆయనతో (తాత) గొడవ పడ్డారట. ఈ వయసులో ఇలా గుడి కట్టడం నీకు అవసరమా అంటూ తాతతో అనన్య నిత్యం గొడవ పడేదట. కానీ ఆయన అవేవి పట్టించుకోకుండా గుడిని పూర్తి చేసారు.

అందుకనే వారంతా ఆయనని మోడరన్ ఏజ్ రామదాసు అని పిలుస్తారట. ఇక ఈ గుడి ఓపెనింగ్ వచ్చే వారం జరగబోతుందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన తాతని, రాముడి విగ్రహాన్ని అనన్య అందరికి పరిచయం చేసారు. ఇప్పుడు తన తాత కళ్ళలో కనిపిస్తున్న ఆనందం తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అనన్య చెప్పుకోచ్చారు.

Also read : Rajinikanth – Vishal : విశాల్ రజినీకాంత్ కి కౌంటర్ ఇచ్చాడా.. వైరల్ అవుతున్న పొలిటికల్ కామెంట్స్..

  Last Updated: 17 Apr 2024, 12:30 PM IST