Site icon HashtagU Telugu

Ananya Nagalla : అందుకేనేమో నన్నెవ్వరూ ట్రై చెయ్యట్లేదు.. అనన్య నాగళ్ళ

Ananya Nagalla said no one proposed to her

Ananya Nagalla said no one proposed to her

చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్న అనన్య నాగళ్ళకు వకీల్ సాబ్ లో చేసిన క్యారెక్టర్ తో మంచి ఫేమ్ వచ్చింది. దీంతో అనన్య ప్రస్తుతం చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పలు పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. మొదట్లో చాలా పద్దతిగా ఫోటోలు పెట్టే అనన్య వకీల్ సాబ్ తో వచ్చిన ఫేమ్ తర్వాత బోల్డ్ గా కూడా ఫోటోలు పెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవడమే కాక మరిన్ని అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేస్తుంది.

తాజాగా అనన్య నాగళ్ళ ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో, ఫాలోవర్స్ తో ముచ్చటించింది. వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. దీంతో ఓ ఫాలోవర్ మీ బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పండి, అతని ఇన్‌స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పండి అని అడిగాడు. దీనికి అనన్య నాగళ్ళ సమాధానమిస్తూ.. బాయ్ ఫ్రెండా.. నాకు అంతా సీన్ లేదు భయ్యా. అందరూ నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారనుకుంటున్నారు. అందుకేనేమో ఎవ్వరూ నన్ను ట్రై చెయ్యట్లేదు. అదే ప్రాబ్లమేమో అని చెప్పింది. దీంతో అనన్య రిప్లై వైరల్ కాగా మరి ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేస్తారేమో చూడాలి.

అలాగే ఓ నెటిజన్.. లాస్ట్ టైం మిమ్మల్ని స్టేడియంలో బాటిల్ తో కొట్టింది నేనే అని చెప్పగా.. దానికి అనన్య రిప్లై ఇచ్చి.. అలా ఎలా కొడతారు, మేము కూడా మనుషులమే కదా, అయినా నేను వెనక్కి తిరిగి మరీ మీకు హాయ్ చెప్పాను కదా, ఇంకెప్పుడు వేరే ఆర్టిస్టులతో కూడా ఇలా ప్రవర్తించకండి అని చెప్పింది.

 

Also Read :   Nani : శ్రీరామనవమికి ‘దసరా’ బ్లాక్ బస్టర్.. ఈసారి క్రిస్మస్ ని టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్..