Site icon HashtagU Telugu

Anand – Vaishnavi : మళ్ళీ బేబీ కాంబో.. ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య సినిమా అనౌన్స్.. ఆ సిరీస్ కి సీక్వెల్..?

Anand Deverakonda Vaishnavi Chaitanya New Movie Announced

Vaishnavi Chaitanya Anand

Anand – Vaishnavi : ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. 20 కోట్లతో ఈ సినిమా తీస్తే ఆల్మోస్ట్ 100 కోట్లు వసూలు చేసి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో షార్ట్ ఫిలిం నటి వైష్ణవి చైతన్య కాస్త స్టార్ హీరోయిన్ అయిపోయింది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

బేబీ హిట్ తర్వాత ఈ కాంబో మరోసారి కలిసి నటించనుంది. తాజాగా నేడు ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య కొత్త సినిమా అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈటీవి ఓటీటీలో వచ్చిన 90S సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సిరీస్ తీసిన డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఆ సిరీస్ కి సీక్వెల్ గా ఈ సినిమాని తీస్తున్నారు. 90S సిరీస్ లో చిన్న కొడుకు పాత్ర పెద్దయ్యాక అతని లవ్ స్టోరీ ఏంటి అని ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..

Also Read : Sankranthiki Vasthunnam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?