Site icon HashtagU Telugu

Baby Block Buster : బుల్లితెర మీద బేబీ బ్లాక్ బస్టర్..!

Anand Devarakonda Vaishnavi

Anand Devarakonda Vaishnavi

Baby Block Buster ఆనంద్ దేవరకొండ, వైష్ణవి. విరాజ్ ప్రధాన పాత్రలుగా నటించిన బేబీ సినిమా థియేట్రికల్ హిట్ అందుకుంది. సినిమా 10 కోట్ల బిజినెస్ చేస్తే ఫుల్ రన్ లో 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. యూత్ ఆడియన్స్ అంతా ఈ సినిమా చూసి తెగ ఎంజాయ్ చేశారు. సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన బేబీ సినిమా చాలా కాలం తర్వాత యూత్ ని మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేసింది. ఈ సినిమా హిట్ క్రెడిట్ ఎవరికి ఎక్కువ అన్నది చెప్పడం కష్టం కానీ టీం ఎఫర్ట్ తో అందరు హిట్ కొట్టారు.

అయితే సినిమా డిజిటల్ రిలీజ్ పెద్దగా ఆడలేదు. థియేట్రికల్ రన్ లోనే చాలా వరకు చూశారు కానీ డిజిటల్ స్ట్రీమింగ్ లో పెద్దగా చూడలేదు. కానీ స్మాల్ స్క్రీన్ పై మరోసారి బేబీ (Baby) తన హవా కొనసాగించింది. బేబీ సినిమా శాటిలైట్ రైట్స్ ఈటీవీ దక్కించుకుంది. ఈ సినిమా రీసెంట్ గా టెలికాస్ట్ కాగా సినిమాకు అర్బన్ రేంజ్ లో 5.89, రూరల్ రేంజ్ లో 5.67 టి.ఆర్.పి రేటింగ్ వచ్చాయి.

Also Read : Bigg Boss 7 : ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన స్టార్ కంటెస్టెంట్..!

అదే రోజు మరో రెండు సూపర్ హిట్ సినిమాలు కూడా స్మాల్ స్క్రీన్ లో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి నాని దసరా కాగా శ్రీ విష్ణు రీసెంట్ హిట్ సామజవరగమన కూడా వచ్చాయి. విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల కన్నా బేబీ సినిమాకే ఎక్కువ రేటింగ్ వచ్చింది. దసరా (Dasara) సినిమాకు 4.99 రేటింగ్ రాగా శ్రీ విష్ణు (Sri Vishnu) సినిమాకు 3.05 టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది.

ఈటీవీలో ఎక్కువగా సీరియల్స్ వస్తాయి కానీ సినిమాలు అది కూడా కొత్త సినిమాలు రావడం చాలా అరుదు. ఈమధ్య కాలంలో అయితే పెద్ద సినిమాలేవి ఈటీవీ కొన్న దాఖలాలు లేవు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, డియర్ మేఘ, పంచతంత్రం లాంటి సినిమాలు ఈటీవీ దక్కించుకుంది. బేబీ సినిమాతో ఈటీవీ సినిమా రేటింగ్ కూడా పెరిగింది.

We’re now on WhatsApp. Click to Join