విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda). ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం బేబీ(Baby) సినిమాతో భారీ హిట్ కొట్టాడు. విజయ్ గురించి పలు ప్రేమ కథలు రూమర్స్ గా వినిపిస్తున్నా ఆనంద్ గురించి ఇప్పటివరకు ఒక్క ప్రేమకథ కూడా వినిపించలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనంద్ తన ప్రేమ, బ్రేకప్ గురించి చెప్పుకొచ్చాడు.
ఆనంద్ దేవరకొండ అమెరికాలో పై చదువులు చదువుకొని అక్కడే జాబ్ చేసాడని తెలిసిందే. తన ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయ్యాక, అన్నయ్య హీరో అయ్యాక తాను కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ తో అమెరికా నుంచి వచ్చేసాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ తన ప్రేమ గురించి చెప్తూ.. ఇద్దరం ఇక్కడ ఉన్నప్పటి నుంచే ప్రేమించుకున్నాం. తను పై చదువుల కోసం అమెరికా వెళ్ళింది. నేను కూడా వెళ్తే తనతో హ్యాపీగా వుండొచ్చు అనుకోని తను ఉండే చికాగో దగ్గర్లోని ఓ యూనివర్సిటీలో సీట్ సంపాదించి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అంతా రివర్స్ అయింది. మా ప్రేమ బ్రేకప్ అయింది. ఆ బాధ నుండి బయటకి రావడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టింది. నేను నిజాయితీగానే ప్రేమించాను. కానీ మా ప్రేమ ముందుకెళ్ళలేదు. ఆ విషయంలో చాలా బాధపడ్డాను అని తెలిపాడు. అయితే ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు బ్రేకప్ అయింది మాత్రం చెప్పలేదు.
Also Read : Raviteja : ఓ పక్కన ‘ఈగల్’ హిట్.. మరో పక్క అప్పుడే ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..