Site icon HashtagU Telugu

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండకి స్పెషల్ విషెస్ తెలిపిన రష్మిక.. ఆనందా అంటూ!

Mixcollage 16 Mar 2024 12 25 Pm 6598

Mixcollage 16 Mar 2024 12 25 Pm 6598

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందనల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి. అందుకు అనుగుణంగానే రష్మిక విజయ్ ఎప్పటికప్పుడు వాటికి ఆజ్యం పోస్తూ ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించడం ఇద్దరు కలిసి ఒకే విధమైన షర్ట్లు వేసుకోవడం లాంటివి చేయడంతో ఆ వార్తలు మరింత వైరల్ అయ్యాయి.

ఇలా తరచూ ఏదో ఒక విషయంతో వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక, విజయ్ ల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి ఆనంద్ దేవరకొండ వల్ల వైరల్ అవుతున్నారు. నేడు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు అతనికి విషెష్ చెప్తున్నారు.

K

ఈ క్రమంలో రష్మిక మందన కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే ఆనందా.. అని పోస్ట్ చేసింది.దీంతో ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ థ్యాంక్యూ రషీ.. కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు.

L

దీనికి రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా పోస్ట్ చేసింది. దీంతో ఆనంద్ రష్మికని క్యూట్ గా రషీ అని పిలుస్తాడని తెలుస్తుంది. అలా వీరిద్దరూ పెట్టిన పోస్ట్ లు వైరల్ గా మారాయి.