Gachibowli Lands: గచ్చిబౌలి ఏరియాలోని భూముల విలువ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ మహా నగరంలో హాట్ కేకులాంటి ఏరియా ఏదైనా ఉందంటే.. అది గచ్చిబౌలి. ఇలాంటి విలువైన ఏరియాలో భూములను ఎవరైనా దానం చేస్తారా ? అస్సలు చేయరు. ఇప్పుడున్న మూవీ స్టార్లు ఎవరూ అంత సాహసం చేయలేరు. ఏవో చిన్నపాటి విరాళాలు ఇవ్వమంటే ఇస్తారే తప్ప.. ఏకంగా ఎకరాల కొద్దీ భూమిని దానం ఇవ్వమంటే అస్సలు ఇవ్వరు. గచ్చిబౌలి(Gachibowli Lands)లో ప్లేస్ ఉంటే ఏదైనా భవంతిని నిర్మించి అద్దెకు ఇవ్వడం, స్థలాన్ని లీజుకు ఇవ్వడం, స్టార్ హోటల్ నిర్మించడం లాంటి ప్లాన్స్ చేస్తారు. ఆ ల్యాండ్‌తో వీలైనంత ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. కానీ అలనాటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెద్ద మనసుతో గచ్చిబౌలిలో 10 ఎకరాల భూమిని దానం చేశారు. ఆయనెవరో కాదు..ప్రభాకర్ రెడ్డి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డుల్లో భాగంగా వినోదాత్మక సినిమా విభాగంలో ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేసింది.
Also Read :Ration Cards: ఆ రేషన్ కార్డులు రద్దు.. ఈ-కేవైసీపై కొత్త అప్‌డేట్
చిత్రపురి కాలనీ.. 10 ఎకరాలు ఆయనవే
గాంధీ పుట్టిన దేశం, పండంటి కాపురం, కార్తీక దీపం, గృహప్రవేశం, కుంకుమ తిలకం లాంటి సినిమాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రభాకర్ రెడ్డి అద్భుతంగా నటించారు. నటించారు అనడం కంటే ఆ పాత్రల్లో జీవించారు అనడం కరెక్టు. సినీ కార్మికుల కోసం గచ్చిబౌలి ఏరియాలోని తన 10 ఎకరాల భూమిని ప్రభాకర్ రెడ్డి ఉచితంగా దానం చేశారు. ఆనాడు దాని విలువ రూ. 80 కోట్లదాకా ఉండేది. ఆ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది. ఇప్పుడు ఆ 10 ఎకరాల విలువ రూ.600 కోట్ల దాకా ఉంటుందని అంచనా.
ప్రభాకర్ రెడ్డి మనవడు, కుమార్తె..
ప్రభాకర్ రెడ్డి చేసిన భూదానం వివరాలతో గతంలో ఆయన మనవడు శ్రీకర్ సన్నపరెడ్డి లింక్డ్ ఇన్‌లో ఒక పోస్ట్ చేశారు. చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం తొలి హౌసింగ్ ప్రాజెక్టును ప్రారంభించే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం వేళ తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ప్రభాకర్ రెడ్డి కుమార్తె శైలజా రెడ్డి వాపోయారు. తమ తండ్రి ప్రభాకర్ రెడ్డి చేసిన భూదానానికి విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.