Site icon HashtagU Telugu

Amitabh – Kamal – Rajini : అమితాబ్, కమల్, రజినీ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

Amitabh Kamal haasan and Rajinikanth worked together in one movie

Amitabh Kamal haasan and Rajinikanth worked together in one movie

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), రజినీకాంత్(Rajinikanth).. లెజెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. వారివారి యాక్టింగ్ స్టైల్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. మరి అలాంటి సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇంకెలా ఉంటుంది. వీరు ముగ్గురు కలిసి బాలీవుడ్ లోని ఒక సినిమాలో నటించారు. 1985 లో వచ్చిన ‘గెరాఫ్తార్‌’ (Geraftaar) సినిమాలో ఈ ముగ్గురు కలిసి కనిపించి ఆడియన్స్ కి థ్రిల్ ని కలిగించారు.

యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని ప్రయాగ్ రాజ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో కమల్ అండ్ అమితాబ్ అన్నదమ్ములుగా కనిపిస్తారు. కొన్ని కారణాలు వల్ల చిన్నప్పుడే కమల్ హాసన్ ఇంటిలో నుంచి బయటకి వెళ్లిపోవాల్సి వస్తుంది. పెద్దయ్యాక వీరిద్దరూ ఎలా, ఎప్పుడు, ఎటువంటి పరిస్థితిలో కలుసుకున్నారు అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో రజినీకాంత్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తాడు. ఆ సమయంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టించింది.

ఈ సినిమా కంటే అమితాబ్ అండ్ కమల్ ఒక సినిమా చేయాల్సి ఉంది. 1984 లో ‘ఖబడ్ధార్’ అనే చిత్రాన్ని ప్రకటించి దాదాపు 50 శాతం పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఆ చిత్రం ఎందుకో మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా మిస్ అయినా ఆ తరువాతి సంవత్సరంలోనే ‘గెరాఫ్తార్‌’ కలిసి కనిపించి అలరించారు. ఇక రజినీకాంత్ అండ్ అమితాబ్ కలిసి.. ‘హమ్‌’, ‘అంధా కానూన్‌’, ‘గెరాఫ్తార్‌’ మూడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. అమితాబ్ అండ్ కమల్ ప్రాజెక్ట్ K లో నటిస్తుంటే.. రజినీ జై భీం దర్శకుడితో చేయబోతున్న సినిమాలో అమితాబ్ ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నాడు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Adipurush Collections : ఆదిపురుష్ కలెక్షన్స్.. పది రోజులు అయినా 500 కోట్లు కూడా రాలే.. ఇలా అయితే కష్టమే