Site icon HashtagU Telugu

Amitabh – Ayodhya : రామయ్య సన్నిధిలో అమితాబ్.. అయోధ్యలో మెగాస్టార్ ఏం చేయబోతున్నారంటే..

Amitabh Ayodhya

Amitabh Ayodhya

Amitabh – Ayodhya : బాలీవుడ్ మెగాస్టార్ 81 ఏళ్ల అమితాబ్ బచ్చన్ శుక్రవారం మరోసారి అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. శ్రీరాముడికి ఈసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అమితాబ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఓ ఆభరణాల తయారీ కంపెనీ తమ జ్యువెల్లరీ షోరూమ్‌ను త్వరలోనే అయోధ్యలో తెరవనుందట. దాన్ని ప్రారంభించడానికి మరోసారి అయోధ్యకు అమితాబ్ వస్తారని సమాచారం.  జనవరి 22న అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది.  ఆ వేడుకలోనూ కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి అమితాబ్ పాల్గొన్నారు.  ఆ కార్యక్రమానికి 7,000 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు . వేడుక ముగిసిన తర్వాత విశిష్ట అతిథులను ప్రధాని మోడీ అభినందించారు.

We’re now on WhatsApp. Click to Join

అమితాబ్ రూ.14.5 కోట్లు

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్యలో అమితాబ్ భూమిని కొన్నారనేది ఆ వార్త సారాంశం. దీంతో అయోధ్యలోని భూమి రేట్లు, అమితాబ్‌ కొన్న స్థలంపై అంతటా చర్చ మొదలైంది. అయోధ్యలో రియల్ ఎస్టేట్‌ రంగానికి ఊపు కల్పించేందుకే.. అమితాబ్ వార్తను వైరల్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ముంబైకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఏబీఎల్)’ అయోధ్యలో అభివృద్ది చేసిన 51 ఎకరాల వెంచర్‌‌లో అమితాబ్ భూమిని కొన్నారని తెలుస్తోంది. అమితాబ్ ప్లాట్‌ ‘సెవెన్‌ స్టార్‌ మల్టీ పర్పస్‌ ఎన్‌క్లేవ్‌ ది సరయూ’లో ఉందని అంటున్నారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భూమిలో సొంతింటిని అమితాబ్ కట్టుకోనున్నాని అంటున్నారు. అయోధ్యలో స్థలం కొనుగోలుకు  అమితాబ్ రూ.14.5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ స్థలం రామమందిరానికి 10 నిమిషాల దూరంలో,  అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంకు 20 నిమిషాల దూరంలో, సరయూ నదికి 2 నిమిషాల దూరంలో ఉందట.

Also Read : IRCTC – Ayodhya : అయోధ్య రైల్వే స్టేషన్‌లో ఇక ఆ సదుపాయాలు కూడా..

1750 చదరపు అడుగుల స్థలం.. రూ.2.50 కోట్లు

2028 నాటికల్లా ఈ  ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఏబీఎల్ యాజమాన్యం వెల్లడించింది. తమ ప్రాజెక్టులో మొదటి ప్లాట్ ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh – Ayodhya) కొనడంపై ఆ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. ది హౌజ్‌ ఆఫ్‌ అభినందన్‌ లోధా షేర్‌ చేసిన బ్రోచర్‌లో అయోధ్య భూమి వివరాలు ఇలా ఉన్నాయి. తమ వెంచర్‌‌లో 1250 చదరపు అడుగల భూమి ధర రూ.1.80కోట్లు ఉండగా.. 1500 చదరపు అడుగు ప్లాట్‌ధర రూ.2.35 కోట్లుగా ఉందని హెచ్ఏబీఎల్ పేర్కొంది. 1750 చదరపు అడుగుల స్థలం ధర రూ.2.50 కోట్లు పలుకుతున్నట్టు సదరు సంస్థ వెల్లడించింది.

Exit mobile version