Kalki 2898 AD : కల్కి టీం చేసే ఆలస్యాలకు అమితాబ్ కూడా దండం పెట్టేసారు.. ట్వీట్ వైరల్..

కల్కి టీం చేసే ఆలస్యాలకు అమితాబ్ కూడా దండం పెట్టేసారు. అమితాబ్ చేసిన ట్వీట్ కి దర్శకుడు నాగ్ అశ్విన్ సమాధానం ఏంటంటే..

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 01:25 PM IST

Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో, కమల్ హాసన్ విలన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడి’. సి అశ్విని దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌ యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రూపొందుతుండడంతో గ్రాఫిక్స్ అండ్ విఎఫెక్స్ వర్క్స్ తో ఆలస్యం అవుతూ వస్తుంది.

సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏ అప్డేట్ ని చెప్పిన టైంకి రిలీజ్ చేయడం లేదు. ఇక ఈ ఆలస్యాలతో అభిమానులు విసిగిపోతున్నారు. అప్డేట్ సిద్ధంగా లేనప్పుడు, డేట్ అనౌన్స్ చేసి వెయిట్ చేయించడం ఎందుకు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఫీలింగ్స్ తో అడ్డుకుంటున్నారా అంటూ దర్సకనిర్మాతలను నిలదీస్తున్నారు. రీసెంట్ గా మూవీ కోసం సిద్ధం చేసిన ప్రమోషనల్ సాంగ్ ‘భైరవ యాంతం’ని నిన్న జూన్ 16న రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసారు.

కానీ రిలీజ్ చేయలేకపోయారు. దీంతో నిన్న కేవలం ఆడియోని రిలీజ్ చేసి.. నేడు ఉదయం గం.11లకు వీడియో సాంగ్ ని రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసారు. కానీ ఈరోజు కూడా సాంగ్ రిలీజ్ చేయలేకపోయారు. దీంతో అభిమానులతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా అలిసిపోయారు. కల్కి టీం చేస్తున్న ఆలస్యాల పై అమితాబ్ రియాక్ట్ అవుతూ.. “ఓర్పుతో ఎదురుచూస్తున్నా” అంటూ దండం పెడుతున్న ఈమోజీని షేర్ చేసారు.

ఈ ట్వీట్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అవుతూ.. “మీ సహనానికి కృతజ్ఞతలు సార్. కొన్ని విషయాల్లో ఆలస్యాలు జరుగుతాయి. వాటికీ నేను సాకులు చెప్పలేను. కానీ మొత్తం బృందం నిజంగా నాన్ స్టాప్ గా పని చేస్తోంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.