Site icon HashtagU Telugu

Amitabh Bachchan: ట్రాఫిక్ తో బిగ్ బీ బేజార్.. బైక్ పై షూటింగ్ కు అమితాబ్!

Big Bee

Big Bee

ట్రాఫిక్ సమస్య.. సామాన్యులనే కాదు, సెలిబ్రిటీలను వెంటాడుతుంటుంది. తీవ్ర ట్రాఫిక్ సమయంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. బాలీవుడ్ నటుడు బిగ్ బీని సైతం ట్రాఫిక్ కష్టాలు వెంటాడాయి. వయసు మీదా పడ్డా కూడా తోటి నటులకు ఏమాత్రం తగ్గకుండా షూటింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. అమితాబ్ (Amitabh Bachchan) కు నిత్యం ఏదో ఒక చోట షూటింగ్స్ ఉంటూనే ఉంటుంది. ఏదైనా టైమ్ ఫిక్స్ చేశాడంటే.. అనుకున్న సమయానికి కంటే ముందుగానే అక్కడికి చేరుకోవడం అలవాటు.  అయితే నిన్న ఆదివారం ట్రాఫిక్ ఇష్యూ కారణంగా షూటింగ్ కు చేరుకోలేని పరిస్థితి. నటన పట్ల ఆయనకున్న డెడికేషన్ సమయానికి చేరేలా చేసింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో అమితాబ్ బచ్చన్ ఓ  అభిమానిని లిఫ్ట్ అడిగారు. అభిమాన్ అమితాబ్ ను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే విషయం తెలుసుకొని బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ.. వేగంగా వెళ్తూ సమయానికి షూటింగ్ లొకేషన్ చేరుకున్నారు.

నల్లటి టీ-షర్టు, నీలిరంగు ప్యాంటు, బ్రౌన్ బ్లేజర్ ధరించి రైడ్ చేస్తూ కనిపించాడు. ఇదే విషయాన్ని ఇన్ స్టాలో అందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు బిగ్ బీ. అభిమానితో బైక్ (Bike) పై దూసుకెళ్లిన బిగ్ బీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అమితాబ్ పోస్ట్‌కి క్యాప్షన్ చేస్తూ, “రైడ్ బడ్డీకి ధన్యవాదాలు. మీకు తెలియదు. మీరు నన్ను టైమ్ కు షూటింగ్ స్పాట్ కు చేర్చగలిగారు. ట్రాఫిక్ సమస్యను తట్టుకొని ముందుకు సాగారు. క్యాప్డ్, షార్ట్, పసుపు రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తికి ధన్యవాదాలు.” అంటూ రియాక్ట్ అయ్యాడు.

ఈ పోస్ట్‌పై స్పందించిన అమితాబ్ మనవరాలు నవ్య నవేలి నందా నవ్వుతూ స్పందించింది. రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. “మీరు భూమిపై అత్యంత కూల్ అయిన వ్యక్తి అమిత్ జీ! నిన్ను ప్రేమిస్తున్నాను. సయానీ గుప్తా కూడా రియాక్ట్ అవుతూ  “మిస్టర్ బచ్చన్ ఎల్లప్పుడూ చాలా సమయపాలన పాటించేవారని విన్నాను! మీకు నిజంగా సమయాన్ని (Timing) గౌరవించడం అంటే ఏమిటో ఈ రోజు చూశాను అంటూ ప్రశంసలు కురిపించారు. మరికొందరు అభిమానులు మాత్రం హెల్మెట్ ధరించలేదని కామెంట్స్ చేశారు. “డియర్ సర్ హెల్మెట్ ధరించకపోతే ఎలా ము సమయానికి మీరు అనుకున్న ప్రాంతానికి చేరగలిగారు. కానీ భద్రత కూడా ముఖ్యమే కదా అని రియాక్ట్ అయ్యారు. “దయచేసి హెల్మెట్ ధరించండి” అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. ఏదేమైనా అమితాబ్ చేసిన పనికి నెటిజన్స్ తో పాటు బిగ్ బీ అభిమానులు ఫిదా అయ్యారు.

Also Read: Tiffin In Govt Schools : ప్రభుత్వ బడుల్లో ఇక ఉదయం పూట టిఫిన్

Exit mobile version