Amitabh Bachchan: అభిమానుల్ని కలిసినప్పుడు అమితాబ్ చెప్పులు వేసుకోరు ఎందుకో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు అభిమానులున్నారు. ఎనిమిది పదుల వయసులోనూ అమితాబ్ సినిమాల్లో నటిస్తున్నారు అంటే అది కేవలం అభిమానుల కోసమే.

Published By: HashtagU Telugu Desk
Amitabh Bachchan

New Web Story Copy 2023 06 06t201924.650

Amitabh Bachchan: ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు అభిమానులున్నారు. ఎనిమిది పదుల వయసులోనూ అమితాబ్ సినిమాల్లో నటిస్తున్నారు అంటే అది కేవలం అభిమానుల కోసమే. ఈ విషయాన్ని ఆయన ఎన్నో వేదికలపై పంచుకున్నారు. అయితే స్టార్ స్టేటస్ లో ఉన్న అమితాబ్ ని కలవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆయనని కలవడానికి ఒక మార్గం ఉంది. అమితాబ్ ప్రతి ఆదివారం అభిమానులని కలిసే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దీంతో అభిమానులు అమితాబ్ ని కలిసేందుకు ప్రతి ఆదివారం ఆయన ఇంటిముందు బారులు తీరుతున్నారు.

అమితాబ్ బచ్చన్ కొన్నాళ్లుగా అభిమానులను కలుసుకునే ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. బిగ్ బి దినచర్యలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమితాబ్ చెప్పులు లేకుండా అభిమానులను కలుస్తారు. తాజాగా తన ఈ అలవాటు వెనుక రహస్యాన్ని బయటపెట్టాడు.

తాజాగా అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో అభిమానులతో సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో పాటు చెప్పులు లేకుండానే అభిమానులను కలవడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ.. గుడికి వెళ్లినప్పుడు చెప్పులు లేకుండానే వెళ్తామని, బిగ్ బీకి తన అభిమానులే గుడి అని అన్నారు. అందుకే తన ప్రియమైన వారిని కలిసినప్పుడల్లా చెప్పులు లేకుండానే వెళ్తుంటాడు. ఇక అమితాబ్ బచ్చన్ చివరిసారిగా సూరజ్ బర్జాత్యా చిత్రం ఉహ్తియాలో కనిపించాడు.

Read More: TDP – BJP Alliance : టీడీపీతో క‌లిస్తే బీజేపీకి లాభ‌మా? ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు.. మోదీ, షా వ్యూహం అదుర్స్‌?

  Last Updated: 06 Jun 2023, 08:19 PM IST