Amitabh Bachchan : పలువురు సెలబ్రిటీలు బాగా సంపాదిస్తూ అదే రేంజ్ లో ట్యాక్స్ లు కూడా కడతారు. గత సంవత్సరం సినిమా సెలబ్రిటీలలో అత్యధికంగా షారుఖ్ ఖాన్ 92 కోట్ల ట్యాక్స్ కట్టాడు అని తెలియడంతోనే అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈసారి అమితాబ్ షారుఖ్ గత సంవత్సరం కట్టిన ట్యాక్స్ ని మించి ట్యాక్స్ కట్టారట.
బాలీవుడ్ సమాచారం ప్రకారం 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను అమితాబ్ దాదాపు 350 కోట్లకు పైగా సంపాదించగా అందులో 120 కోట్ల ట్యాక్స్ కట్టారని సమాచారం. సినిమాలు, యాడ్స్, కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోల ద్వారా అమితాబ్ బాగానే సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో అమితాబ్ 120 కోట్లు ట్యాక్స్ కట్టారని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
82 ఏళ్ళ వయసులో కూడా అమితాబ్ అంత సంపాదిస్తూ ట్యాక్స్ లు కట్టడం అనేది అభినందించదగ్గ విషయమే. సాధారణంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి అందరికంటే ఎక్కువగా 30 శాతం పైగా ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఈ రంగంలోని వాళ్ళు భారీగా ట్యాక్స్ లు కడతారు. ప్రస్తుతం అమితాబ్ కట్టిన ట్యాక్స్ చర్చగా మారింది. మరి ఈసారి షారుఖ్ ఎంత ట్యాక్స్ కడతాడో చూడాలి.
Also Read : Shah Rukh Khan : సుకుమార్ డైరెక్షన్ లో షారుఖ్.. కానీ హీరోగా కాదు.. ఆ సినిమా కోసమా?