Site icon HashtagU Telugu

RC 16: రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్.. ఏ సినిమాలో అంటే?

Rc 16

Rc 16

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తున్న పేరు బుచ్చిబాబు. ఏ ముహూర్తాన రాంచరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఓకే అయిందో కానీ అప్పటి నుంచి బుచ్చిబాబు పేరు సెన్సేషనల్ గా మారింది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో మూవీ అంటేనే హైప్ భారీగా పెరిగింది. దానికి తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటూ మరో బాంబు పేల్చడంతో ఆ అంచనాలు కాస్త మరింత పెరిగాయి. ఆ షాక్ నుంచి బయటికి రాకముందే శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి అంటూ RC16 క్యాస్టింగ్ గుట్టు విప్పి మరో షాక్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join
ఇప్పుడేమో ఏకంగా అమితాబ్ బచ్చన్‌నే లైన్‌లోకి తీసుకొస్తున్నారు దర్శకుడు. ఇలా సినిమా ఇంకా మొదలు కాకముందే అంచనాలను ఒక రేంజ్ లో పెంచేశారు. ఇక సినిమాను మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. RC16లో తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ను ఒప్పించే పనిలో ఉన్నారు. బడ్జెట్ విషయంలో ఫ్రీడమ్ ఇవ్వడంతో కాస్టింగ్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు బుచ్చిబాబు. సైరా తర్వాత కల్కిలో భాగం అయ్యారు అమితాబ్. ఇప్పుడు చరణ్ సినిమాలో తాత పాత్రలో బిగ్ బి నటించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read: Pranitha Subhash: చీర కట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న ప్రణీత.. ఫోటోస్ వైరల్!

RC16లో కేవలం కాస్ట్ అండ్ క్య్రూకే భారీగా ఖర్చు పెడుతున్నారు. రామ్ చరణ్ 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటుండగా బుచ్చిబాబు, జాన్వీ కపూర్, రెహమాన్ కూడా భారీగానే తీసుకుంటున్నారు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. సమ్మర్ 2025లో RC16 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి పెద్ది అనే టైటిల్  ను పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Tamannaah Bhatia: మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన తమన్నా.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?