Amitabh Bachchan : 50వేల మంది రియల్ ఆడియన్స్ మధ్యలో సాంగ్ షూట్ చేసిన అమితాబ్ బచ్చన్..

1981లో అమితాబ్ నటించిన ‘యారానా’(Yaarana) అనే సినిమాలోని ‘సారా జమానా’ సాంగ్ ని చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు.

  • Written By:
  • Publish Date - October 3, 2023 / 07:21 PM IST

బాలీవుడ్(Bollywood) హీరో అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan).. విభిన్న పాత్రల్లో నటించి, తనదైన శైలిలో డ్యాన్స్‌ లు చేసి భారతీయ సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగాడు. అమితాబ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా కొన్ని పాటలు దేశమంతటా పాపులర్ అయ్యాయి. ఇక అమితాబ్ సినిమాల్లో పాటలకి ఉన్న క్రేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు.. మూవీలోని సాంగ్స్ ని కూడా ప్రత్యేకంగా తెరకెక్కించడానికి ప్రయత్నించేవారు. ఈక్రమంలోనే 1981లో అమితాబ్ నటించిన ‘యారానా’(Yaarana) అనే సినిమాలోని ‘సారా జమానా’ సాంగ్ ని చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు.

ఈ సాంగ్ ని ఒక ఇండోర్ స్టేడియంలో దాదాపు 50వేల మంది అభిమానుల మధ్య చిత్రీకరించారు. ఈ పాటని కోల్‌కతాలోని ‘నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌’ ఇండోర్‌ స్టేడియంలో తెరకెక్కిద్దామని నిర్మాతకు అమితాబే ఐడియా ఇచ్చాడు. ఆ స్టేడియంలో 12వేలు మంది ఆడియన్స్ కూర్చొనే సామర్ధ్యత ఉంది. అయితే అంతమంది ఆర్టిస్టులను ఎక్కడి నుంచి తీసుకు రావాలని నిర్మాత ఆలోచించడం మొదలు పెట్టాడట. ఇక అందుకు పరిష్కారం కూడా అమితాబే చెప్పాడు. ‘ఇలా ఒక స్టేడియంలో అమితాబ్ బచ్చన్ షూటింగ్ జరుగుతుంది. అందురు రావచ్చని ప్రచారం చేయండి చాలు’ అని సలహా ఇచ్చాడు.

దీంతో నిర్మాత ఆ వార్తని ప్రచారం చేశాడు. అయితే నిర్మాతకు, అమితాబ్ కు ఒక షాక్ తగిలింది. అమితాబ్ ని చూసేందుకు దాదాపు లక్ష పైగా అభిమానులు స్టేడియంకి చేరుకున్నారు. అయితే వారిలో ఒక 50వేల మంది మాత్రమే స్టేడియంలోకి రాగలిగారు. మిగిలిన వారంతా స్టేడియం బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఈ పాటలో అమితాబ్ బచ్చన్.. ఒక సరికొత్త డ్రెస్ లో కనిపించి డాన్స్ చేశాడు. ఆ పాటలో అమితాబ్ వేసుకున్న డ్రెస్ కి వెలిగే బల్బులు ఉంటాయి. ఈ ఐడియా కూడా అమితాబ్ ఇచ్చిందే. అమితాబే దగ్గర ఉండి ఆ డ్రెస్ ని డిజైన్ చేయించుకున్నాడట. అప్పటిలో ఆ డ్రెస్, ఆ సాంగ్ ఒక ట్రెండ్ సెట్ గా నిలిచింది.