Site icon HashtagU Telugu

Prabhas Kalki 2898 AD : కల్కి కోసం అమితాబ్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత..?

Amitab Bacchan Remunertion For Prabhas Kalki 2898 Ad

Amitab Bacchan Remunertion For Prabhas Kalki 2898 Ad

Prabhas Kalki 2898 AD నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా లో దీపికా పదుకొనె, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటాని లాంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపిస్తున్నారు. అందుకు సంబందించిన గ్లింప్స్ రీసెంట్ గా రిలీజైంది.

కల్కి సినిమా కోసం అశ్వత్థమగా ప్రేక్షకులను అలరించనున్నారు అమితాబ్ బచ్చన్. ఇక ఈ సినిమా కోసం అమితాబ్ 45 రోజుల దాకా డేట్స్ ఇచ్చాడట. సినిమా కోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కల్కి లో నటించినందుకు గాను అమితాబ్ బచ్చన్ కు దాదాపు 18 కోట్ల దాకా రెమ్యునరేషన్ గా ఇచ్చారట నిర్మాతలు. కల్కి సినిమాలో అమితాబ్ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

కల్కి సినిమా మహాభారత కాలం నుంచి ప్రెజెంట్ జనరేషన్ వరకు టైం ట్రావెల్ కథతో వస్తుంది. ఈ సినిమాలో విజువల్స్ ఆడియన్స్ ని సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని అంటున్నారు. సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తున్నారు. మే 9న రిలీజ్ అనుకున్న కల్కి సినిమా జూన్, జూలైకి వాయిదా వేస్తున్నారని టాక్.

ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ఎప్పుడొచ్చినా సరే ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ అనిపించేలా మూవీ ఉంటుందని తెలుస్తుంది. కల్కి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సరికొత్త రికార్డుల మీద కన్నేశాడు ప్రభాస్. ఈ సినిమాకు బిజినెస్ కూడా రికార్డ్ లెవెల్లో జరుగుతుంది.

Also Read : Rajasekhar : ఫాదర్ రోల్ లో రాజశేఖర్.. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా..?