Site icon HashtagU Telugu

Rashmika Mandanna: ఇట్స్ జస్ట్ టైపాస్ రూమర్స్..!

Rashimka

Rashimka

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ జంట ఒక్కటైతే బాగుంటుందని అభిమానులు కూడా ఆనందపడ్డారు. అయితే పెళ్లి వార్తలపై రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. హిట్ ఫెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట తరచుగా పార్టీలకు, వీకెండ్స్ కు వెళ్తుండటం.. క్లోజ్ గా మూవ్ అవుతుండటంతో పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. పెళ్లిపై బాలీవుడ్ మీడియా కూడా గాసిప్స్ కు తావివ్వడంతో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యాడు. ‘ఇది నాన్సెస్ న్యూస్’ అంటూ సీరియస్ అయ్యాడు. తాజాగా రష్మిక స్పందించారు. “ఇది కేవలం టైమ్ పాస్ వార్తలేనని, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఆ పుకార్లన్నింటినీ నేను ఇష్టపడుతున్నాను” అంటూ క్లారిటీ ఇచ్చింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం కోసం చేతులు కలిపారు. ఈ చిత్రం విజయం సాధించడంతో ఇద్దరి కెరీర్ కు బాగా హెల్ప్ అయ్యింది. టాలీవుడ్ లో సుస్థిర స్థానం తెచ్చిపెట్టింది. గీత గోవిందం తర్వాత  వీరిద్దరూ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కూడా హెట్ పెయిర్ అనిపించింది. వెండితెర ముందు, వెండితెర వెనుక వీళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్క్ వుట్ అవ్వడం అభిమానులకూ సంతోషం కల్గించే విషయం.

Exit mobile version