Site icon HashtagU Telugu

Mahesh Babu : అమెరికాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్.. వీడియో వైరల్..

Mahesh Babu Sreeleela

Mahesh Babu Sreeleela

Mahesh Babu : ప్రస్తుతం తెలుగు సినిమాలు, తెలుగు పాటలు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపుని సంపాదించుకుంటున్నాయి. ఇప్పటివరకు పాప్ సాంగ్ కల్చర్ ని ఎంజాయ్ చేసిన వరల్డ్ మ్యూజిక్ లవర్స్.. ఇప్పుడు తెలుగు మాస్ సాంగ్ కల్చర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నాటు నాటు, పుష్ప సాంగ్స్ తరువాత ఇప్పుడు కుర్చీ మడతపెట్టి సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపుని సంపాదించుకుంటుంది.

ఇటీవల ఒక అమెరికన్ జిమ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ని పెట్టుకొని వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా అమెరికాలో జరుగుతున్న ఓ నేషనల్ గేమ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ వినిపించి సందడి చేసింది. అమెరికాలోని హూస్టన్ లో జరుగుతున్న నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్ లో ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పలువురు అమెరికన్స్.. కుర్చీ మడతపెట్టి సాంగ్ కి డాన్స్ వేసి అదరగొట్టారు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. నాటు నాటు, పుష్ప సాంగ్స్ తరువాత ఇలా ఇంటర్నేషనల్ వేదికల పై వినిపించిన తెలుగు సాంగ్ కుర్చీ మడతపెట్టి. కాగా ఈ పాట రిలీజైనప్పుడు టాలీవుడ్ లో ఎన్నో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఎందుకంటే, ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిన బూతు పదాన్ని తీసుకోని మహేష్ బాబు వంటి స్టార్ హీరో సాంగ్ చేయడం ఏంటని చాలామంది అసహనం వ్యక్తం చేసారు.

అయితే ఎన్నో విమర్శలు అందుకున్న ఈ పాట.. మెల్లిమెల్లిగా మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కి కూడా బాగా రీచ్ అయ్యింది. జోష్ తెప్పించే బీట్స్ ఉండడంతో ఇండియాలోని ఇతర భాషల్లో కూడా ఈ పాట తెగ వినిపిస్తుంది. ఇటీవల తమిళనాడులోని ఓ కాలేజీ ఈవెంట్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ రీ సౌండ్ వచ్చింది. మరి రానున్న రోజుల్లో ఈ సాంగ్ ఇంకెంతటి రీచ్ ని అందుకుంటుందో చూడాలి. కన్నా ఈ సాంగ్ కి థమన్ సంగీతం అందించగా శ్రీకృష్ణ, సాహితి చాగంటి పాడారు.

Also read : Chiranjeevi : చిరంజీవి ఇంటి నుంచి డ్రెస్ దొంగలించిన సుమ.. స్టేజిపై పట్టుకున్న చిరు..