Ram Charan : రామ్ చరణ్‌తో పని చేయాలని ఉంది.. హాలీవుడ్ పాప్ సింగర్ కామెంట్స్..

హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ పాప్ సింగర్ రామ్ చరణ్‌తో పని చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు.

  • Written By:
  • Publish Date - June 7, 2024 / 11:08 AM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్ రీచ్ ని సంపాదించుకున్నారు. పలు వేరియేషన్స్ ఉన్న రామరాజు పాత్రని చరణ్ అద్భుతంగా పోషించి.. టాలీవుడ్ టు బాలీవుడ్ అందర్నీ మెప్పించారు. కేవలం సాధారణ ప్రేక్షకులను మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని మేకర్స్ ని కూడా చరణ్ మెప్పించారు. వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన జేమ్స్ కామెరాన్ సైతం.. రామరాజు పాత్రకు ఫిదా అయ్యారు.

హాలీవుడ్ కి చెందిన కొందరు మేకర్స్ అయితే.. రామ్ చరణ్ తో పని చేయాలని ఉందంటూ డైరెక్ట్ గా తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ హాలీవుడ్ పాప్ సింగర్ రామ్ చరణ్‌తో పని చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. అమెరికాకు చెందిన ప్రముఖ వెస్ట్రన్ సింగెర్స్ ‘ది చైన్ స్మోకర్స్’ (The Chainsmokers) రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో.. ‘బాలీవుడ్ లేదా ఇండియన్ సినిమాలో ఎవరితో కలిసి పని చేయాలని ఉంది’ అంటూ ప్రశ్నించారు.

దానికి ఆ సింగర్ బదులిస్తూ.. ‘ఆర్ఆర్ఆర్ మూవీ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన రామ్ చరణ్ తో పని చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమా తనకి బాగా నచ్చిందని, చరణ్ నటనకి అభిమానిని అయ్యిపోయానని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. చరణ్ అభిమానులు గ్లోబల్ స్టార్ అంటూ సందడి చేస్తున్నారు.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. మూడేళ్ళుగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కి ఎట్టకేలకు ముగింపుకి వచ్చింది. మరో ముపై రోజుల షూటింగ్ మాత్రమే ఉందట. దానిలో చరణ్ షెడ్యూల్ కేవలం పది రోజులు మాత్రమే అంట. మరో రెండు మూడు రోజుల్లో ఈ మూవీ రాజమండ్రి షెడ్యూల్ మొదలు కానుంది.