Site icon HashtagU Telugu

BRO : పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఫై అంబటి రాంబాబు రియాక్షన్

Minister Ambati Rambabu React On Trolls

Minister Ambati Rambabu React On Trolls

నిన్నటి నుండి సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్న వీడియో ఫై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. బ్రో (BRO) మూవీ లో ఓ పబ్ సీన్ లో సాయిధరమ్ తేజ్ (Sai Teju), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తుంటారు. ఆ సీన్‌లో అమ్మాయిల పిచ్చి ఉన్న శ్యాంబాబు (30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ) అనే క్యారెక్టర్ నాన్ సింక్‌లో మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తుంటాడు. దాంతో పవన్ స్పందిస్తూ.. శ్యాంబాబు.. ప్లే అవుతున్న మ్యూజిక్ ఏమిటి? నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? అంటూ సీరియస్ అవుతాడు. ఈ సిన్ లో గతంలో అంబటి రాంబాబు వేసిన డాన్స్ పోలి పృద్వి వేయడం..అచ్చం మంత్రి అంబటి రాంబాబు వేసుకున్న టి షర్ట్ మాదిరే పృద్వి వేసుకోవడం తో శ్యాంబాబు వేసిన స్టెప్పుల వీడియోను, అంబటి రాంబాబు వేసిన వీడియోను మిక్స్ చేసి అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ ట్రోల్స్ ఫై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు.

‘తానేమీ పవన్ కళ్యాణ్ లా ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేసే వ్యక్తిని కాదని అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ సీరియస్ అయ్యారు. పవన్ తనను ఎదుర్కొలేకపోతున్నారని.. అందుకే సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ సృష్టించి శునకానందం పొందుతున్నారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి అంటూ విమర్శించారు. పవన్ తన డ్యాన్సులను విమర్శించే స్థాయికి దిగజారరంటూ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏపీలో వైసీపీ vs జనసేన వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను వైస్సార్సీపీ (YSRCP) టార్గెట్ గా పెట్టుకుంది.. రాజకీయాలతోనే కాకుండా సినిమాల ద్వారా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని చూస్తుంది. దీంతో పవన్ సైతం వైస్సార్సీపీ నేతలను టార్గెట్ గా చేసి వారిపై విమర్శలు , సెటైర్లు వేస్తూ వస్తున్నారు. తన సినిమాల్లో కూడా పంచ్ డైలాగ్స్ వేస్తూ ప్రభుత్వం ఫై పరోక్షంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు బ్రో మూవీ లో కూడా పృద్వి క్యారెక్టర్ ద్వారా మంత్రి అంబటి ఫై సెటైర్లు వేశారని అంత మాట్లాడుకుంటున్నారు. కాకపోతే మేకర్స్ మాత్రం అది ఎవర్ని ఉద్దేశించి కాదని , కథలో ఆలా ఉంది అంతే అని క్లారిటీ ఇస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ లు నటించిన మూవీ బ్రో (BRO). సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం (జులై 28న) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ టాక్ రావడం తో అభిమానులు, మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను పీపూల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించారు.

Read Also : BRO : ఏపీలో ఆ రెండు చోట్ల బ్రో షోస్ ను నిలిపివేశారు…