Site icon HashtagU Telugu

Ambati Rambabu : మీ స్వభావం ఇది అంటూ పవన్ కళ్యాణ్ పై అంబటి కామెంట్స్

Ambati Pawan

Ambati Pawan

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకపడ్డారు. గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్ (Game Changer ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న పేరు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగుతుంది. జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈరోజు రాజమండ్రి లో ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కావడం తో సినిమాకు మరింత బజ్ వచ్చింది. ఇక ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..’టికెట్ల రేట్ల ఎందుకు పెంచుతారని చాలా మంది అంటారు. ప్రస్తుత కాలంలో సినిమా బడ్జెట్‌ విపరీతంగా పెరిగింది. సినిమా మొదటి రోజు చూడాలి అనుకునే వారు బ్లాక్‌లో టికెట్లు కొనుగోలు చేసి చూస్తున్నారు. ఆ డబ్బులు నిర్మాతకు, హీరోకు కాకుండా మరెవ్వరికో వెళ్తాయి. టికెట్ల రేట్లు డిమాండ్‌ అండ్ సప్లై సిద్దాంతం ప్రకారం పెరుగుతాయి. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో వెళ్తుంది. ఆ స్థాయి సినిమాలు తీయాలంటే, డబ్బులు కావాలంటే టికెట్ల రేట్లు పెంచాలి. టికెట్ల రేటుపై పెరిగిన ప్రతి రూపాయికి ప్రభుత్వానికి పన్ను వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నా సినిమాకు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకుండా రేట్లు ఇంకా తగ్గించారు.

Game Changer Pre Release : వైస్ జగన్ పై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు

టికెట్ల పెంపు కోసం హీరోలు రానక్కర్లేదు. నిర్మాతలు మా వద్దకు వస్తే చాలు మేము అది చేస్తాం. హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలని మేము అనుకోవడం లేదు. అంత లో లెవల్‌ వ్యక్తులం కాదు మేము. దీన్ని మేము ఎన్టీఆర్‌ గారి నుంచి నేర్చుకున్నాం. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్‌ గారు మాత్రం వివక్ష చూపించలేదు. అదే ఔన్నత్యంను కొనసాగిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మాదిరిగా మేము వ్యవహరించం అన్నారు. సినిమాల కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తనకు ముఖ్యం అని పవన్‌ చెప్పుకొచ్చారు.

Game Changer: రిలీజ్‌కు ముందే గేమ్ ఛేంజ‌ర్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం!

హీరోలు వచ్చి నమస్కారం పెట్టాలనే మనస్తత్వం తమది కాదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘తోటి హీరోని అన్యాయంగా అరెస్టు చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై కూటమికి శ్రేణులు , మెగా అభిమానులు అంబటి పై విరుచుకపడుతున్నారు.