Site icon HashtagU Telugu

Ambati Dance: బ్రో సినిమాలో అంబటి డ్యాన్స్..తేజ్ క్లారిటీ

New Web Story Copy (83)

New Web Story Copy (83)

Ambati Dance: పవన్ కళ్యాణ్, అల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలై పాజిటక్ తెచ్చుకుంది. సినిమాలో పవన్ ఎనర్జీకి బాగానే మార్కులు పడ్డాయి. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నటుడు పృథ్వీ చేసిన డ్యాన్స్ రాజకీయ టర్న్ తీసుకుంది. పృథ్వీ చేసిన డ్యాన్స్ ఏపీ మంత్రి అంబటి రాయుడు చేసిన డ్యాన్స్ మాదిరిగా ఉందంటున్నారు. సంక్రాంతి పండుగ నాడు అంబటి రాయుడు టీషీర్ట్ ట్రాక్ లో వేసిన డ్యాన్స్ అప్పట్లో వైరల్ అయింది. తెలుగు పండుగ కావడంతో అప్పట్లో అంబటి డ్యాన్స్ ను అందరూ బాగానే స్వీకరించారు. అయితే తాజాగా పవన్ నటించిన బ్రో సినిమాలో అదే తరహా డ్యాన్స్ లో కనిపించారు పృథ్వీ. దీనిపై అంబటి స్పందించారు. తనదైన రీతిలో కామెంట్స్ చేశారు. గెలిచినోడికి సంక్రాంతి అని, ఓడినోడికి కాళరాత్రి అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఈ ఇష్యూపై సాయి ధరమ్ తేజ్ స్పందించాడు.

ఓ మీడియా ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ధరమ్ తేజ్ కూల్ గా రియాక్ట్ అయ్యాడు. అంబటి రాయుడు డ్యాన్స్ ను బ్రో సినిమాలో ఎందుకు పెట్టారని, అచ్చం అంబటి రాయుడు టీషీర్ట్, ట్రాక్, డ్యాన్స్ దించేశారని యాంకర్ సరదాగా అడగగా, దానికి ధరమ్ తేజ్ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. అంబటి రాయుడికి మీసాలు ఉంటాయి, పృథ్వీకి మీసాలు లేవని, హెయిర్ స్టయిల్ కూడా వేరుగా ఉందని చెప్పాడు. అంతేకాకుండా అంబటి రాయుడు చాలా బాగా డ్యాన్స్ వేసినట్టు తెలిపాడు. ఏదేమైనా ప్రస్తుతం అంబటి డ్యాన్స్, పృథ్వీ చేసిన డ్యాన్స్ ని పక్కపక్కన పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: Driving License: ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కు విశేష స్పందన, 7వేల మందికి లైసెన్స్ లు