వైసీపీ (YCP) తన పంథాను మార్చుకోబోతుందా..? రాజకీయాలతో కాదు సినిమాలతో అది కూడా అల్లు అర్జున్ ద్వారా తమ ఉనికిని పెంచుకోవాలని చూస్తుందా..? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై అల్లు అర్జున్ (Allu Arjun) ద్వారా పగ తీర్చుకోవాలని చూస్తుందా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా అల్లు అర్జున్ vs పవన్ కళ్యాణ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం మరింత వైరాన్ని పెంచింది. ఆ తర్వాత కూడా మెగా హీరోలు కూడా పరోక్షంగా అల్లు అర్జున్ పై ఘాటైన వ్యాఖ్యలే చేయడం..బన్నీ సైతం అదే రేంజ్ లో కౌంటర్లు ఇవ్వడం చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 05 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా కోసం మెగా అభిమానులు కాచుకొని కూర్చున్నారు. ఎలాగైనా ఈ సినిమాను దెబ్బ కొట్టాలని కొంతమంది మెగా ఫ్యాన్స్ భావిస్తుంటే..మరికొంతమంది లైట్ బ్రదర్ ని అంటున్నారు.
ఈ క్రమంలో వైసీపీ పుష్ప 2 రాజకీయంగా మార్చేందుకు ప్లాన్ చేస్తుంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్ సినిమాను అడ్డుకున్నారని, ఇప్పుడు ‘పుష్ప’ మూవీని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.’మంచి సినిమాలను ఎవరూ అడ్డుకోలేరు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్. ‘పుష్ప2’ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఈ సినిమాపై కొంత మందికి జెలసీగా ఉంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ను బహిష్కరించాలని అనుకోవడం అవివేకం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ప్రధానంగా పుష్ప 2 సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని, కొంతమంది ఈ సినిమాపై అసూయతో అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని తెలుపడం తో దీనిగురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్ పేరు ప్రస్తావన రావడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకోవడం ద్వారా ఆయా వారిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తే, ప్రేక్షకులు మరియు పరిశ్రమ వారికి మద్దతుగా నిలబడతారని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు పుష్ప 2 ను ఎందుకు అడ్డుకుంటారు..? దానికి రాజకీయాలకు సంబంధం ఏంటి..? మధ్యలో ఎన్టీఆర్ పేరును ఎందుకు లాగుతున్నారు..? ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్న కొత్త డ్రామా..అని, కావాలంటే అభిమానులకు , ఏపీ సర్కార్ కు మధ్య వివాదం సృష్టించాలని చూస్తున్నారని సినీ అభిమానులు , జనసేన శ్రేణులు అంటున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
Read Also : Biography of Singer Hemlata :”దస్తాన్-ఈ-హేమలత” పుస్తక ఆవిష్కరణ..