బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి (Bigg boss 7 fame Ambati Arjun ) ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.పండంటి ఆడబిడ్డకి ఆయన భార్య సురేఖ (Surekha) జన్మనిచ్చింది. బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అర్జున్ అంబటి..ఇటీవల బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా సందడి చేసి ఫినాలే వరకు వెళ్ళాడు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లో అడుగుపెట్టిన అర్జున్..తనదైన ఆట తో ఆకట్టుకున్నాడు. ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో తన భార్య సురేఖ ప్రెగ్నెంట్ అని తెలిసిందే. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన భార్యని మిస్ అవుతున్నానని అర్జున్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్యామిలీ వీక్ లో భాగంగా సురేఖ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో కంటెస్టెంట్లు అందరూ కూడా ఆమెకు సీమంతపు వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఈయనకు కుమార్తె జన్మించిందనే (Blessed with Beautiful baby Girl) విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తనకు కూతురు పుట్టిందనే విషయాన్ని మాత్రమే కాకుండా తన కుమార్తె పేరును కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన కుమార్తెకు అర్క (ARKHA) అనే పేరు పెడుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈయన ముందుగానే మాకు పాప పుడితే ఇదే పేరు పెడతామని బిగ్ బాస్ వేదిక ఫై తెలుపడం జరిగింది. అక్కడ చెప్పినట్లే ఈరోజు పాప పుట్టడం తో అదే పేరు పెట్టారు.
తన పేరు అర్జున్ లో Ar తన భార్య సురేఖ పేరు నుంచి kha కలిపి తన కుమార్తెకు Arkha అనే పేరును పెడుతున్నట్టు ఈ సందర్భంగా అర్జున్ తన కుమార్తె పేరును కూడా తెలియచేయడంతో ఎంతో మంది అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
Read Also :