Site icon HashtagU Telugu

Virupaksha : ‘విరూపాక్ష’ సినిమా బిగ్‌బాస్ నటుడితో చేయాల్సింది.. కానీ సాయి దుర్గ తేజ్..

Ambati Arjun Is First Choice For Sai Durgha Tej Virupaksha Movie

Ambati Arjun Is First Choice For Sai Durgha Tej Virupaksha Movie

Virupaksha : మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటించిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయగా, ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసారు. చేతబడులు నేపథ్యంతో 2023లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది.

అయితే ఈ మూవీ సాయి దుర్గ తేజ్ చేయాల్సింది కాదట. ఈ సినిమాని ముందుగా బిగ్‌బాస్ నటుడితో ప్లాన్ చేశారట. దాదాపు రెండేళ్లు ఆ సినిమా కోసం వర్క్ చేశారట. కానీ చివరికి అది సాయి దుర్గ తేజ్ వద్దకి వచ్చింది. అసలు ఏమైంది..? ఇంతకీ ఆ బిగ్‌బాస్ నటుడు ఎవరు..? ఎందుకని ఆ స్క్రిప్ట్ సాయి దుర్గ తేజ్ వద్దకి వెళ్ళింది..? ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో ఆ బిగ్‌బాస్ నటుడి చెప్పుకొచ్చారు.

తెలుగు టీవీ సీరియల్స్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న విజయవాడ కుర్రాడు ‘అర్జున్ అంబటి’. ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడ చివరి వరకు వచ్చి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అయితే బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే అర్జున్.. విరూపాక్ష ఆఫర్ ని అందుకున్నారు. దర్శకుడు కార్తీక్ వర్మ మొదటిగా ఆ కథని అర్జున్‌కే వినిపించారట.

అప్పుడు ఆ సినిమా టైటిల్ ‘శాసనం’ అంట. ఆ మూవీని తెరకెక్కించడం కోసం ఆల్మోస్ట్ రెండేళ్ల పాటు నిర్మాతలు కోసం తిరిగారట. అయితే అర్జున్ కొత్తవాడు అవ్వడంతో నిర్మాతలు ప్రొడ్యూస్ చేయడానికి అలోచించి వెనకడుగు వేస్తూ వచ్చారట. దీంతో చేసేది లేక అర్జున్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. అది సాయి దుర్గ తేజ్ వద్దకి చేరింది. ఇక ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడమే కాదు, సీక్వెల్ పై కూడా ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. మరి ఆ సీక్వెల్ ఎప్పుడు వస్తుందో చూడాలి.