Box Office : ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు ‘ సౌండ్ మాములుగా లేదు

కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ (Suhas) నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు (Ambajipeta Marriage Band) మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 2) రిలీజైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఈ మధ్య ప్రేక్షకులు ఎక్కువగా ఓటిటి లకు అలవాటు పడినప్పటికీ..మంచి కథ తో సినిమాలు వస్తే తప్పకుండ థియేటర్స్ కు వెళ్లి సినిమా చూస్తున్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Ambajipeta Marriage Band Co

Ambajipeta Marriage Band Co

కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ (Suhas) నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు (Ambajipeta Marriage Band) మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 2) రిలీజైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఈ మధ్య ప్రేక్షకులు ఎక్కువగా ఓటిటి లకు అలవాటు పడినప్పటికీ..మంచి కథ తో సినిమాలు వస్తే తప్పకుండ థియేటర్స్ కు వెళ్లి సినిమా చూస్తున్నారు. దీనికి ఉదాహరణే హనుమాన్ మూవీ.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సినిమా సంక్రాంతి బరిలో వచ్చి అగ్ర హీరోల సినిమాలను సైతం పక్కకు నెట్టి ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్ల తో రన్ అవుతూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇక ఇప్పుడు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ సైతం అలాగే టాక్ సొంతం చేసుకొని వసూళ్ల వర్షం కురిపిస్తూ నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు కాసులు కురిపిస్తుంది. దుశ్యంత్‌ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. శివాని నగరం హీరోయిన్‌గా నటిచింది.

రూరల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 2.28 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజుల్లో ఏకంగా రూ.5.28 కోట్లు వసూలు చేసింది. తాజాగా మూడో రోజు ఆదివారం కూడా చాల చోట్ల హౌస్ ఫుల్ తో రన్ అయ్యింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.8.6 కోట్లు వసూళ్లు రాబట్టింది. భవిష్యత్ లో ఈ మూవీ 14 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కించాయి.

Read Also : Pragya Jaiswal : హద్దులు దాటేసిన ప్రగ్య జైస్వాల్ అందాల విందు

  Last Updated: 05 Feb 2024, 03:53 PM IST