Site icon HashtagU Telugu

Amardeep Chowdary: ఆ రోజు కుటుంబంతో రోడ్డు మీద నిల్చున్నాను.. సంచలన విషయాలు వెల్లడించిన అమర్‌దీప్‌!

Amardeep Chowdary

Amardeep Chowdary

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ రన్న రప్, బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమరదీప్. ఆ తర్వాత అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటి సంపాదించుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ సీరియల్స్ లో వెబ్ సిరీస్ లలో నటించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరోగా మారి సినిమాలలో కూడా నటిస్తున్నాడు అమర్దీప్ చౌదరి.

ఇకపోతే బుల్లితెర నటి తేజస్విని గౌడను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కూడా తెలుగులో చాలా సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి చాలా షోలలోకి పాల్గొని ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు. బుల్లితెరపై ఈ జంటకు భారీగానే క్రేజ్ ఉంది. ప్రస్తుతం అమర్దీప్ అలాగే తేజస్విని ఇద్దరూ సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కాగా అమర్‌దీప్‌ టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత తో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుప్రీత హీరోయిన్గా నటిస్తుండగా అమర్‌దీప్‌ చౌదరి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇకపోతే సుప్రిత ఇటీవల యాంకర్ గా అవతారం ఎత్తి ఫీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షోకు నటుడు అమర్‌దీప్‌, జబర్దస్త్ లేడి కమెడియన్‌ వర్ష అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా సుప్రిత అడిగిన చాలా రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అమర్‌దీప్‌. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే తర్వాత ఒక సంఘటన జరిగింది కదా.. అప్పుడు మీ రియాక్షన్‌ ఏంటి? అని ప్రశ్నించింది. అందుకు అమర్‌ దీప్ స్పందిస్తూ.. ఆ రోజు నేను నా కుటుంబంతో రోడ్డు మీద నిల్చున్నాను. నేనేం చేయాలనుకుంటున్నానో ఆ దారిలో వెళ్తున్నాను. లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌.. బ్రో, వి డోంట్‌ కేర్‌​ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.