Site icon HashtagU Telugu

Amala Paul : రెండో పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్.. బర్త్‌డే రోజు రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన కాబోయే వరుడు..

Amala Paul will marry soon with her boy friend Jagat Desai

Amala Paul will marry soon with her boy friend Jagat Desai

మలయాళ నటి అమలాపాల్(Amala Paul) మలయాళం, తమిళ్, తెలుగు సినిమాలతో పాపులర్ అయింది. తెలుగులో ఇటీవల ఎక్కువ సినిమాలు చేయకపోయినా తమిళ్ సినిమాలతో పలకరిస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ట్రిప్స్ వేస్తూ ఆ ట్రిప్స్ వీడియోస్ తో పాటు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అమలాపాల్ గతంలో తమిళ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ మూడేళ్లకే విడాకులు తీసుకుంది. తాజాగా అమలాపాల్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది. జగత్ దేశాయ్(Jagat Desai) అనే ఓ బిజినెస్ మెన్ ని అమలాపాల్ పెళ్లి చేసుకోనుంది. నేడు అమలాపాల్ పుట్టిన రోజు కావడంతో జగత్, అమల వెకేషన్ కి వెళ్లారు. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ జగత్ అమలాపాల్ కి ప్రపోజ్ చేసాడు. ఆమె ఓకే చెప్పింది. దీంతో జగత్ అమలాపాల్ తో డ్యాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి అమలాపాల్ ఓకే చెప్పింది అని పోస్ట్ చేశాడు.

అలాగే అమలాపాల్ తో రొమాంటిక్ గా దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఇక పలువురు అభిమానులు, ప్రముఖులు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.

 

Also Read : RT4GM : రవితేజ గోపీచంద్ సినిమా పూజా కార్యక్రమాలతో షురూ.. నాలుగో సారి హిట్ రెడీ..