Site icon HashtagU Telugu

Kamal Haasan: ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 సినిమా కూడా అయిపోయిందా : కమల్ హాసన్

Kamal Haasan

Kamal Haasan

టాలీవుడ్ నటుడు లోకనాయకుడు కమల్ హాసన్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన కమల్ హాసన్ ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో హీరోగా నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. కాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో శంకర్ దర్శకత్వంలో చేసిన ఇండియన్ సినిమా భారీ హిట్ అవ్వగా దానికి సీక్వెల్ ఇండియన్ 2 తీస్తున్నామని ప్రకటించారు.

ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఇండియన్ 3 సినిమా కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ తో పాటు తన సినిమాల గురించి కూడా మాట్లాడారు. కమల్ హాసన్ తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఆల్రెడీ ఇండియన్ 2 సినిమాతో పాటు ఇండియన్ 3 షూటింగ్ కూడా అయిపొయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇండియన్ 2 సినిమా ఎలక్షన్స్ అయ్యాక రిలీజ్ అవుతుంది.

థగ్ లైఫ్ సినిమా షూట్ కూడా ఎన్నికలు అయ్యాక మొదలవుతుంది. కల్కి 2898AD సినిమాలో ఒక గెస్ట్ పాత్ర చేశాను అని తెలిపారు. దీంతో ఇండియన్ సీక్వెల్స్ పై క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 కూడా ఉందని కమల్ హాసన్ చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2 ఆగస్టులో రిలీజ్ అవుతుందని సమాచారం. ఇండియన్ 3 మాత్రం వచ్చే సంవత్సరమే ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Exit mobile version