Site icon HashtagU Telugu

Tollywood : అటు ఐటీ దాడులు..ఇటు మెగా Vs అల్లు ఫ్యాన్స్ మధ్య మాటల దాడులు

Allu Vs Mega War

Allu Vs Mega War

మంగళవారం ఉదయం నుండి టాలీవుడ్ (Tollywood) చిత్రసీమలో అలజడి మొదలైంది. ఒక్కసారిగా ఐటీ అధికారులు(IT Rides) టాలీవుడ్ నిర్మాతలను టార్గెట్ చేయడం షాక్ కు గురిచేసింది. నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ , నిర్మాత అభిషేక్ అగర్వాల్, సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ ఇలా పలువురి సంస్థలపై , ఇళ్లపై అలాగే వారి బంధువుల ఇళ్లపై దాడులు జరగడం అందర్నీ అయోమయానికి గురిచేసింది. ఇదే సమయంలో అల్లు vs మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియా లో మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరడం మరింత షాక్ కు గురి చేసింది.

 

CM Revanth Davos Tour : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూనిలీవర్ గ్రీన్ సిగ్నల్

గత కొద్దీ నెలలుగా మెగా vs అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ ముందు వరకు కూడా వార్ నడిచింది. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యింది. గేమ్ ఛేంజర్ టాక్ తో మరోసారి వార్ మొదలైంది. గేమ్ ఛేంజర్ సినిమా బాగున్నప్పటికీ కావాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేసారని మెగా ఫ్యాన్స్ ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు నిర్మాత దిల్ రాజు తో పాటు పుష్ప మేకర్స్ మైత్రి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగేసరికి మెగా – అల్లు అభిమానులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు. గేమ్ ఛేంజర్ కి మొదటి రోజు 51 కోట్ల కలెక్షన్లు వస్తే.. 181 కోట్ల కలెక్షన్లు వేసుకున్నారని, దాని వల్లే దిల్ రాజు ఆఫీస్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే, పుష్ప 2 కు కూడా ఫేక్ కలెక్షన్స్ ప్రచారం చేయడం వల్లే మైత్రి నిర్మాతలపై దాడులు జరుగుతున్నాయని మెగా ఫ్యాన్స్ ఆరోపించడం స్టార్ట్ చేసారు. ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ కాకరేపుతున్నారు. మరి ఈ వార్ కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో అని నిర్మాతలు మాట్లాడుకుంటున్నారు.