Allu Snehareddy : ఆ హీరోయిన్ తో నటించకూడదంటూ.. భర్తకి కండిషన్ పెట్టిన అల్లు స్నేహారెడ్డి!

స్నేహ రెడ్డి (Allu Snehareddy) హీరోయిన్స్ కి తీసిపోని అందంతో ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులని ఆశ్చర్యం లో ముంచేత్తుతుంది.

Published By: HashtagU Telugu Desk
Allu Snehareddy Has Given A Condition To Her Husband Not To Act With That Heroine!

Allu Snehareddy Has Given A Condition To Her Husband Not To Act With That Heroine!

Allu Snehareddy : స్నేహ రెడ్డితో ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న అల్లు అర్జున్ 2011లో పెళ్లి చేసుకుని బ్యాచిలర్ వైపుకి గుడ్ బై చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ముచ్చటైన జంటకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తూ ఉంటారు.స్నేహ రెడ్డి (Allu Snehareddy) హీరోయిన్స్ కి తీసిపోని అందంతో ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులని ఆశ్చర్యం లో ముంచేత్తుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మధ్యనే ఒక యాడ్ లో కూడా నటించి అందరికీ షాకిచ్చింది. అలాంటి స్నేహ రెడ్డి (Allu Snehareddy) తన భర్తకి ఒక విషయంలో కండిషన్ పెట్టాల్సి వచ్చిందంట అది ఏంటో చూద్దాం. పుష్ప టు సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు.

ఎందుకంటే సందీప్ వంగా రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా సీక్వెల్ పార్క్ ఆ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాలు చేయాలి. ఆ తర్వాతే అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో నాలుగో చిత్రం రాబోతుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా యానిమల్ సినిమాతో ఫేమస్ అయిన బ్యూటి త్రిప్తి డిమ్రి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయి మరీ నటించిన బోల్డ్ సీన్స్ సంగతి మనకి తెలిసిందే కదా. అలాగే స్నేహ రెడ్డికి కూడా తెలిసిందంట. దాంతో ఆమెతో నువ్వు నటించవద్దు అని భర్తకి కండిషన్ పెట్టిందట. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read:  Vijay Sethupati : విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. ఆస్తుల చిట్టా తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

  Last Updated: 27 Jan 2024, 12:09 PM IST