Site icon HashtagU Telugu

Allu Sneha Reddy : బన్నీకి ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేసిన స్నేహ..

Allu Sneha Reddy shares cute photo with Allu Arjun

Allu Sneha Reddy shares cute photo with Allu Arjun

అల్లు అర్జున్(Allu Arjun) భార్య స్నేహ రెడ్డి(Allu Sneha Reddy) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారని తెలిసిందే. రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు, ఫ్యామిలీ విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, తన పిల్లలు అర్హ(Arha), అయాన్ కి సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది స్నేహ.

తాజాగా అల్లు స్నేహ రెడ్డి తన ఇన్‌‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. బన్నీని కౌగలించుకొని బుగ్గపై ముద్దిస్తున్న ఫోటోని స్నేహ షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అభిమానులు, నెటిజన్లు క్యూట్ కపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలో బన్నీ ఫేస్ కనిపించకుండా వెనక్కి తిరిగి నించున్నాడు. ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు.

 

ఇక ఇటీవలే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2(Pushpa 2) సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టు 15 న రిలీజ్ కానుంది.

 

Also Read : Mukesh Gowda : హీరోగా మారబోతున్న ఫేమస్ సీరియల్ నటుడు.. టైటిల్ రిలీజ్..