Allu Sirish Wedding: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు, నటుడు అల్లు శిరీష్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఆయన నయనిక రెడ్డిని 2026, మార్చి 6న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన ముందస్తు వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ తర్వాత కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు సాంప్రదాయక వేడుకల్లో నిమగ్నమయ్యారు.
ఘనంగా జరిగిన ‘పసుపు ముహూర్తం’
నిన్న అల్లు శిరీష్ నివాసంలో ‘పసుపు ముహూర్తం’ వేడుక అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు, కొణిదెల కుటుంబ సభ్యులందరూ హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో ఒక విశేషం అందరినీ ఆకట్టుకుంది. మెగా కుటుంబానికి చెందిన కోడళ్లు, అంటే చిరంజీవి భార్య సురేఖ, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజ్నెవా ఈ వేడుకకు హాజరై, శాస్త్రోక్తంగా జరిగిన పసుపు కుంకుమల క్రతువులో పాల్గొన్నారు. ఇది చూస్తుంటే మెగా- అల్లు కుటుంబాల మధ్య ఉన్న విడదీయలేని బంధం మరోసారి స్పష్టమైందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Also Read: Telangana Municipal Polls Results : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్
వైరల్ అవుతున్న వీడియోలు
ఈ వేడుకకు సంబంధించిన ప్రత్యేక వీడియోను తొలుత అల్లు శిరీష్ పంచుకోగా ఆ తర్వాత అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ స్వయంగా తన తమ్ముడి పెళ్లి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తుండటం విశేషం. నయనిక రెడ్డి, అల్లు శిరీష్ జంట చూడముచ్చటగా ఉన్నారని నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
త్వరలో పెళ్లి పిలుపులు
మార్చి 6న జరగనున్న ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని ప్రముఖులను, రాజకీయ నాయకులను ఆహ్వానించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వివాహ వేదిక, ఇతర ముఖ్యమైన వివరాలను అల్లు కుటుంబం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. దుబాయ్ షూట్ నుండి ఇంటి పట్టున జరుగుతున్న పసుపు ముహూర్తం వరకు అల్లు శిరీష్ వివాహం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా- అల్లు ఫ్యామిలీస్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వివాహ వేడుకకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
