Site icon HashtagU Telugu

Urvashivo Rakshashivo Teaser: యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ “ఉర్వశివో రాక్షసివో”

Urvashi

Urvashi

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది.

తాజాగా “ఉర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు.టీజర్ మొత్తం ఆకట్టుకునేలా ఉంది.టీజర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది.టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది.

స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన పోస్టర్స్,టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అనే నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు.ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.

Exit mobile version