Site icon HashtagU Telugu

Peddi : ‘పెద్ది’ టీజర్ పై అల్లు శిరీష్ ట్వీట్..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

Ram Charan Peddi Movie Audio Rights Sold for Huge Price Beats Pushpa 2 Rights

Ram Charan Peddi Movie Audio Rights Sold for Huge Price Beats Pushpa 2 Rights

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పీరియాడిక్ చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనుందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేసిన ‘ఫస్ట్ షాట్ గ్లింప్స్’ (Peddi First Shot Glimpse) అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో చరణ్ “ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాల.. మళ్లీ పుడతామా ఏంటి?” అంటూ చెప్పిన డైలాగ్స్ పూనకాలు పుట్టిస్తుంది. గ్లింప్స్ చివర్లో బ్యాట్ పట్టుకుని సిక్సర్ కొట్టే సీన్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసేలా చేసింది. ఇక రహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీడియో కు మరింత హైప్ తెచ్చింది.

Adavi Thalli Bata : పవన్ ‘అడవితల్లి బాట’ తో గిరిజన డోలి కష్టాలు తీరబోతున్నాయా..?

ఈ వీడియో పై అభిమానులు , సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ (Allu Sirish) చేసిన ట్వీట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పెద్ది ఫస్ట్ షాట్ మామూలు రేంజ్ లో లేదుగా..హ్యాపీ శ్రీరామ నవమి’ అంటూ శిరీష్ కామెంట్ చేసాడు. దీనిపై అటు అల్లు అర్జున్ అభిమానుల నుండి, ఇటు రామ్ చరణ్ అభిమానుల నుండి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా లో అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో అల్లు అర్జున్ సోదరుడు ఇలా పాజిటివ్ కామెంట్స్ చేస్తే భిన్నమైన రెస్పాన్స్ అభిమానుల నుండి రావడం సహజమే కదా. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘రామ్ చరణ్ నిన్ను కూడా కొనేశాడా?’ అంటూ కామెంట్స్ చేసారు. మరికొంతమంది అల్లు అర్జున్ అభిమానులు అయితే మీ సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడు రామ్ చరణ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కదా, మీకెందుకు ఇవ్వాల్సిన అవసరం అంటూ కామెంట్స్ చేసారు.

కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం పాజిటివ్ గానే రియాక్షన్ ఇచ్చారు. ఎక్కువ శాతం మంది అల్లు శిరీష్ కి కృతఙ్ఞతలు తెలియచేయగా, కొంతమంది అభిమానులు మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి శిరీష్ నుండి పాజిటివ్ టాక్ రావడం హ్యాపీ అంటున్నారు.