Site icon HashtagU Telugu

Dozen Liplocks: ముద్దులే ముద్దులు.. కిస్సింగ్ సీన్స్ లో అల్లు శీరిష్ రికార్డు

Kissing

Kissing

అల్లు శిరీష్ కొత్త మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రేక్షకుల నుండి మంచి రివ్యూలను అందుకుంది. కామెడీ, రొమాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయి. అయితే చాలా మందిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. దర్శకుడు ఈ సినిమాలో అసభ్యకరంగా అనిపించకుండా డజను పైగా లిప్‌లాక్‌ సీన్స్ పెట్టాడు. సాధారణంగా తెలుగు సినిమాల్లో ఒకట్రెండు కిస్ సీన్లు వచ్చినా పెద్ద విషయమే. ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మకం పోతుందనే భయంతో చాలా మంది స్టార్స్ లిప్‌లాక్ సీన్స్ చేయడం మానుకుంటున్నారు.

కానీ ఈ చిత్రంలో, చాలా లిప్‌లాక్ సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి. కానీ ఇప్పటికీ ప్రేక్షకులకు ఏమాత్రం అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదు. దర్శకుడు, నటీనటులు, ముఖ్యంగా అను ఇమ్మాన్యుయేల్‌ని మరింత గ్లామర్ గా చూపించడానికి వారు చేసిన కృషిని అభినందించాలి. అలాగే అల్లు శిరీష్ ఒకే సినిమాలో ఇన్ని లిప్‌లాక్ సీన్లు పెట్టి కొత్త రికార్డు సృష్టించాడు. సమీప భవిష్యత్తులో ఏ టాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ హీరో బ్రేక్ చేయలేని రికార్డ్ ఇది.

Exit mobile version