Allu Sirish: మెగా కుటుంబంలో మరో శుభకార్యం ఘనంగా జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish), నాయనికా రెడ్డిల నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా, పూర్తి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అక్టోబర్ 31వ తేదీన (అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా) ఈ వేడుకను జరుపుకోవాలని శిరీష్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కుటుంభ సభ్యుల నడుమ నిశ్చితార్థం
శిరీష్, నయనికల నిశ్చితార్థం వధువు నాయనికా రెడ్డి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ముందుగా అవుట్‌డోర్ ఎంగేజ్‌మెంట్ ప్లాన్ చేసినప్పటికీ హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా వేదికను ఇండోర్‌కు మార్చినట్లు సమాచారం. అయినప్పటికీ మెగా, అల్లు కుటుంబాల ఆశీస్సుల మధ్య ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.
Also Read: Men Get Romantic: రాత్రి 12 దాటితే మగవారి మనసు ఎందుకు మారుతుంది?
Allu Sirish and Nayanika .congratulations to the couple.they looks great together pic.twitter.com/D48734ZHVO
— 📸 (@onlyypictures) October 31, 2025
మెగా ఫ్యామిలీ సందడి
ఈ ప్రత్యేక వేడుకకు టాలీవుడ్‌లోని మెగా, అల్లు కుటుంబాల ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెగా స్టార్ దంపతులు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్- ఉపాసన, అల్లు అర్జున్- స్నేహ, అల్లు అరవింద్ దంపతులు, నాగబాబు దంపతులు, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు హాజరైనట్లు తెలుస్తోంది.
మెగా కుటుంబంలోని అగ్ర తారలందరూ ఒకే వేదికపైకి చేరడంతో వేడుకకు మరింత శోభ వచ్చింది. నూతన జంట శిరీష్-నయనికకు శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఫొటోలు దిగారు. ఈ అద్భుతమైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొత్త జీవితానికి తొలి అడుగు
తన తాతగారి జయంతిని పురస్కరించుకుని ఈ శుభకార్యాన్ని నిర్వహించడం తన నాయనమ్మ కోరికను తీర్చినట్లైందని శిరీష్ భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం వారి వివాహ బంధానికి తొలి అడుగు పడింది. త్వరలోనే శిరీష్-నయనికల వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. సందడితో నిండిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకతో అల్లు అభిమానులు, సినీ ప్రేమికులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
