Allu Kanakaratnam Passed Away : అల్లు ఫ్యామిలీలో విషాదం..తరలివస్తున్న సినీ ప్రముఖులు

Allu Kanakaratnam Passed Away : ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ నివాసంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న బంధం ఈ క్లిష్ట సమయంలో అందరినీ ఒకచోట చేర్చింది

Published By: HashtagU Telugu Desk
Allu Kanakaratnam

Allu Kanakaratnam

లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అర్జున్ నాయనమ్మ అయిన అల్లు కనకరత్నం (Allu Kanakaratnam) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈమె వయస్సు 94 సంవత్సరాలు. కొంతకాలంగా వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈమె మరణ వార్త తెలియగానే అభిమానులు, సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అల్లు కనకరత్నం అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి.

IBM : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఏపీలో IBM సెంటర్స్

తన అమ్మమ్మ మరణ వార్త విన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైసూర్‌లో జరుగుతున్న తన సినిమా ‘పెద్ది’ షూటింగ్‌ను వెంటనే రద్దు చేసుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. అటు బన్నీ సైతం ముంబై నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ నివాసంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న బంధం ఈ క్లిష్ట సమయంలో అందరినీ ఒకచోట చేర్చింది. వారి ఆత్మీయురాలికి చివరి వీడ్కోలు పలకడానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

  Last Updated: 30 Aug 2025, 09:44 AM IST