Site icon HashtagU Telugu

allu Family : మెగా సంబరాల్లో అల్లు ఫ్యామిలీ మిస్ ..

Allu Family Miss

Allu Family Miss

పిఠాపురంలో భారీ విజయం సాధించడం తో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా వెల్ కం చెప్పింది. విజయం సాధించిన తర్వాత నిన్న ఢిల్లీ NDA సమావేశానికి ఫ్యామిలీ తో కలిసి వెళ్లిన పవన్ కళ్యాణ్..ఈరోజు ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ లోని అన్నయ్య చిరంజీవి ఇంటికి వచ్చాడు. తమ్ముడికి అన్నయ్య గ్రాండ్ వెల్ కం చెప్పారు. గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నాడో తెలియంది కాదు. ఏసీ గదుల్లో..చెమట అంటకుండా..రోజుకు రెండు కోట్లా రెమ్యూనరేషన్ తీసుకునే సత్తా ఉన్నప్పటికీ , ప్రజలకు సేవ చేయాలనీ చెప్పి అన్ని వదులుకొని ప్రజల కోసం కష్టపడుతూ వస్తున్నాడు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఈరోజు రావడం తో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు , సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు ఇలా ప్రతి ఒక్కరూ సంతోషిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు, తన విజయాన్ని పంచుకొనేందుకు పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీ మొత్తం గులాబీ రెక్కలను ఆయనపై చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. తనకు ఎదురుగా వచ్చిన వదిన సురేఖను భావోద్వేగంతో కౌగిలించుకొన్నారు. ఇంట్లోకి వెళ్లగానే నేరుగా పవన్ కల్యాన్ తన అన్నయ్య చిరంజీవి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. తమ్ముడి గెలుపును ఆస్వాదిస్తూ.. తమ్ముడిని కౌగిలించుకొని చిరంజీవి పైకి లేపి గాఢంగా కౌగిలించుకొన్నాడు. అనంతరం గజమాలను తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తూ మెడలో వేశారు. ఈ క్షణాలు మెగా అభిమానుల హృదయాలను కదిలించాయి. ఆ తర్వాత తల్లి అంజనాదేవి , వదిన సురేఖ కాళ్లకు సాక్షాంగ నమస్కారం చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇది కదా ఫ్యామిలీ అంటే అనుకోకుండా ఉండలేరు. ఇలాంటి వేడుకలో మెగా ఫ్యామిలీ అంత ఉన్నారు కానీ అల్లు అరవింద్ ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు. ఇదే విషయం ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్..వైసీపీ అభ్యర్ధికి మద్దతు పలికేందుకు నేరుగా ఆయన ఇంటికి వెళ్లడం..పవన్ కు మాత్రం జస్ట్ ట్వీట్ చేయడం అప్పుడు ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలియంది కాదు..ఆ తర్వాత అల్లు అర్జున్ ను చాలామంది విమర్శించారు. ఇది దృష్టిలో పెట్టుకొనే అల్లు ఫ్యామిలీ అటెండ్ కాలేదా..అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఏది నిజమో వారికే తెలియాలి.