Site icon HashtagU Telugu

Allu Ayaan : అల్లు అర్జున్ తనయుడు అయాన్ క్రికెట్ వీడియో వైరల్.. బ్యాటింగ్ అదరగొడుతూ..

Allu Ayaan, Allu Aravind, Allu Arjun, Pushpa 2

Allu Ayaan, Allu Aravind, Allu Arjun, Pushpa 2

Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలతో ఎంతో ఫేమ్ ని సంపాదించుకుంటే.. ఆయన తనయుడు అయాన్ మాత్రం కేవలం తన చిలిపి అల్లరితోనే ఎంతో ఫేమ్ ని రాబట్టుకుంటున్నాడు. అయాన్ చేసే చిలిపి పనులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అవి చూసి ఎంజాయ్ చేసే నెటిజెన్స్.. అయాన్ ని మోడల్ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. కాగా తాజాగా నెట్టింటలో అయాన్ కి సంబంధించిన ఓ క్రికెట్ వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో అయాన్ తన తాతయ్య అల్లు అరవింద్ తో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నాడు. అల్లు అరవింద్ బౌలింగ్ చేస్తుంటే అయాన్ బ్యాటింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇక తాతయ్య వేసే బాల్ ని అయాన్ బ్యాట్ తో బౌండరీలు దాటిస్తున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. దీనిని వైరల్ చేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే.. ఆ వీడియోని ఫన్నీగా ఎడిట్ చేస్తూ నెటిజెన్స్ ని నవ్విస్తున్నారు. ఆ వీడియో వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

ఇక అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ ని జరుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ షూటింగ్ చివరికి చేరుకుంది. మరో పది శాతం షూటింగ్ తో పాటు కొన్ని ప్యాచ్ వర్క్ పనులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుంది. పుష్ప 1 సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్ ని కూడా అదే సమయంలో తీసుకు వస్తున్నారు. మరి అదే సక్సెస్ రిపీట్ అవుతుందా లేదా చూడాలి.