Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌… ధర ఎంతంటే..?

స్టార్ ప్రొడ్యూసర్లు, హీరోలు, దర్శకులు మార్కెట్లోకి వచ్చిన సూపర్ లగ్జరీ కార్లను కొంటుంటారు. ముఖ్యంగా మెగా మరియు అక్కినేని ఫ్యామిలీ హీరోలకు లగ్జరీ కార్లంటే పడి చస్తారు. మార్కెట్లోకి లగ్జరీ కారు రిలీజ్ అయితే ఈ రెండు కుటుంబ సభ్యుల నుంచి ఒక్కరైనా బుక్ చేస్తారు.

Published By: HashtagU Telugu Desk
Allu Aravind Bmw Car

Allu Aravind Bmw Car

Allu Aravind; స్టార్ ప్రొడ్యూసర్లు, హీరోలు, దర్శకులు మార్కెట్లోకి వచ్చిన సూపర్ లగ్జరీ కార్లను కొంటుంటారు. ముఖ్యంగా మెగా మరియు అక్కినేని ఫ్యామిలీ హీరోలు లగ్జరీ కార్లంటే పడి చస్తారు. మార్కెట్లోకి లగ్జరీ కారు రిలీజ్ అయితే ఈ రెండు కుటుంబ సభ్యుల నుంచి ఒక్కరైనా బుక్ చేస్తారు. ముఖ్యంగా లగ్జరీ కార్లను ఇష్టపడే వారిలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ ముందుంటారు. కొత్తగా మార్కెట్లోకి ఏదైనా కారు వచ్చిందని తెలిస్తే వెంటనే బుక్ చేసేస్తారు. అయితే ఈ సారి అల్లు ఫామిలీ ఓ లగ్జరీ కారుని కొన్నది. తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ చిత్రాల నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ లగ్జరీ ఎలక్ట్రికల్ కారును కొనుగోలు చేశారు.

We’re now on WhatsAppClick to Join

అల్లు అరవింద్ గ్యారేజిలో BMW i7 కారు సందడి చేస్తుంది. దీని ఖరీదు రూ.1.95 కోట్లు (ఎక్స్-షోరూమ్). షో రూం నిర్వాహ‌కులు ఇటీవ‌లే అల్లు అర‌వింద్ ఇంటికి హోం డెలీవ‌రీ చేయ‌గా అర‌వింద్ త‌న భార్య‌తో కలిసి ఫోటోకి ఫోజులిచ్చారు. అల్లు అరవింద్ తన సతీమణితో కలిసి ఈ కొత్త కారుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇండియా మార్కెట్‌లో ఈ కారు విలువ రూ.2.5కోట్లుగా తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ కార్ల‌ను బాలీవుడ్‌లో అజ‌య్ దేవ‌గణ్ వంటి ప‌లువురు ప్ర‌ముఖులు వాడుతుండ‌గా.. త‌మిళ‌నాట స్టార్ హీరో విజ‌య్ ఇటీవ‌ల ఇలాంటి కారును కొనుగోలు చేశారు.

Also Read: Vijay – Mahesh Babu : విజయ్, మహేష్‌తో సినిమా చేస్తానంటున్న తమిళ్ దర్శకుడు..

  Last Updated: 26 Apr 2024, 04:53 PM IST