Allu Arjun: తగ్గేదేలే.. అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా, 200 కోట్ల భారీ బడ్జెట్ తో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పుష్ప2 తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun

Allu Arjun

ప్రముఖ నటుడు అల్లు అర్జున్, తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి వర్క్ చేయబోతున్నాడు. వచ్చే ఏడాది భారీ యాక్షన్-అడ్వెంచర్ మూవీ సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించబడుతుంది. ఎందుకంటే ఇది ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఉండబోతున్నాయి. ‘జైలర్’ భారీ విజయం తర్వాత డైరెక్టర్ నెల్సన్ హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నాడు. బన్నీకి ఓ కథ చెప్పడంతో వెంటనే ఒకే చెప్పాడట.

అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత భారతదేశం అంతటా పాపులారిటీ వచ్చింది. ఈ మూవీ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడుతుంది. ‘పుష్ప2’ తర్వాత అతని క్రేజ్ మరింత పెరగనుంది. “బన్నీ ఇతర ప్రాజెక్ట్‌లకు వెళ్లే ముందు నెల్సన్ సినిమా చేయబోతున్నాడు” అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో అల్లు అర్జున్‌తో బ్లాక్‌బస్టర్ ‘రేసుగుర్రం’ చిత్రాన్ని నిర్మించి, అల్లు అర్జున్‌ని కొత్త కోణంలో చూపించిన నల్లమల్లపు బుజ్జి ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, బన్నీ-నెల్సన్ కలయిక కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమేనని అంటున్నారు అభిమానులు.

Also Read: NTR Devara : దేవరకు రికార్డ్ రేటు.. మైండ్ బ్లాక్ ఆఫర్..!

  Last Updated: 29 Sep 2023, 12:44 PM IST