Allu Arjun: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీలో హీరోగా నటించిన రణబీర్ కపూర్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీనే కాకుండా సినిమాలోని నటీనటుల అన్ని వర్గాల వారిని మెప్పించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రతిఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ సైతం రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు.
“యానిమల్”లో రణబీర్ కపూర్ నటనను అల్లు అర్జున్ మెచ్చుకున్నారు. ఇది మైండ్ బ్లోయింగ్. భారతీయ సినిమా ప్రదర్శన సరికొత్త స్థాయికి తీసుకెళ్లిన సినిమా అని కొనియాడారు. కపూర్ సృష్టించిన మాయాజాలాన్ని వివరించడానికి తన మాటలను సరిపోవంటూ అభివర్ణించాడు. ఈ ఐకాన్ స్టార్ పుష్ప సహనటి రష్మిక మందన్నను కూడా ప్రశంసించాడు. గీతాంజలిగా ఆమె నటనను అద్భుతంగా ఉందన్నాడు. బాబీ, అనిల్ కపూర్ నటన కూడా మెప్పించిందన్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు చేసిన ప్రత్యేక ప్రసంగంలో, అల్లు అర్జున్ సినిమా పరిమితులను అధిగమించినందుకు అతనిని మెచ్చుకున్నాడు. “యానిమల్ ఇండియన్ సినిమా లిస్ట్ లో క్లాసిక్” అని అల్లు అర్జున్ ప్రకటించారు.
Also Read: Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం