Allu Studio: గండిపేటలో ‘అల్లు’ స్టూడియో.. ప్రారంభానికి సిద్ధం

టాలీవుడ్ స్టార్‌లలో ఒకరైన అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Allu

Allu

టాలీవుడ్ స్టార్‌లలో ఒకరైన అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్న అల్లు అర్జున్ నికర విలువ రూ. 350 కోట్లు. అల్లు అర్జున్, అతని కుటుంబం హైదరాబాద్, భారతదేశంలోని ఇతర నగరాల్లో అనేక ఆస్తులను కలిగి ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ‘అల్లు స్టూడియోస్’ చేరింది.

హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంలో ఉన్న అల్లు స్టూడియోస్ అల్లు అరవింద్ తండ్రి, అల్లు అర్జున్ తాత అయిన అల్లు రామలింగయ్యకు అంకితం చేయనున్నారు.  10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి ప్రత్యేక సందర్భంగా భారీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

అల్లు స్టూడియోస్ అత్యాధునిక సాంకేతికత,  సౌకర్యాలన్నాయి. అక్టోబర్ 1 నుండి చలనచిత్రాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోల చిత్రీకరణ కోసం అందుబాటులోకి వస్తోంది. గత సంవత్సరం స్టూడియోల పూజా కార్యక్రమం జరిగింది. అల్లు స్టూడియోస్‌తో పాటు, అల్లు కుటుంబానికి హైదరాబాద్‌లో గీతా ఆర్ట్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 అనే రెండు ప్రొడక్షన్ హౌస్‌లు కూడా ఉన్నాయి.

  Last Updated: 23 Sep 2022, 10:38 PM IST