Site icon HashtagU Telugu

Allu Arjun London: అల్లు అర్జున్ లండన్ టూర్ ఫోటోలు వైరల్

Allu Arjun

Allu Arjun

హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో లండన్ లో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేస్తూ ఫోటోలు, సెల్ఫీలను క్లిక్ మనిపిస్తున్నారు. అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు వాటిని తమ ట్విట్టర్ ఖాతాలలో అప్ లోడ్ చేసి.. అభిమానులకూ లండన్ అందాలను చూపిస్తున్నారు.

అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ ల ఫోటోలకూ లైక్స్ వెల్లు వెత్తుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లండన్ లో ప్రస్తుతం రోజువారీ సగటు ఉష్ణోగ్రత 17 డిగ్రీలు.

హైదరాబాద్ లో 34 నుంచి 38 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే సమ్మర్ సీజన్ లో చాలామంది సెలెబ్రెటీలు లండన్ టూర్ కోసం వెళ్తుంటారు. తదుపరిగా రాబోయే అల్లు అర్జున్ సినిమాల జాబితాలో ” పుష్ప : ది రూల్”, “ఐకాన్” ఉన్నాయి. జూన్ నుంచి ” పుష్ప : ది రూల్” షూటింగ్ మొదలవుతుంది. కొరటాల శివ, ఏ.ఆర్.మురుగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెరో సినిమాలోనూ బన్నీ నటించనున్నారు.

 

 

 

Exit mobile version