Site icon HashtagU Telugu

Allu Arjun: అల్లు వారి ఇళ్లు అదరహో.. బన్నీ ఇళ్లు నిజంగా ఇంద్రభవనమే!

Allu Arjun

Allu Arjun

ఫ్యాషన్ లోనే కాదు.. ఇంటి నిర్మాణంలోనూ తన మార్క్ ను చూపిస్తున్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన ఇళ్లు సకల హంగులతో నిర్మించబడి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తోంది. జూబ్లీ హోమ్ అనేది ఆయన కుటుంబ సభ్యులనే కాకుండా సినీ సెలబ్రిటీలను సైతం మంత్రముగ్ధులను చేసే స్వర్గం లాంటిది. ముఖ్యంగా  ‘అల్లు గార్డెన్స్’ ఐకాన్ స్టార్ కు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. అందుకే అల్లు అర్జున్ వీరాభిమానులు ఒక్కసారైన తమ అభిమాన హీరో ఇల్లు చూడాలని తహతహలాడుతుంటారు. ఇంద్రధనుసు లాంటి ఇళ్లను చూసేందుకు ఆసక్తి చూపుతారు.

అల్లు అరవింద్ ఇటీవల తన హైదరాబాద్ జూబ్లీ హోమ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రం బేబీ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రాండ్ పార్టీని నిర్వహించారు. ఈ వేడుక అతని ఎస్టేట్‌లో అద్భుతమైన గార్డెన్‌లో జరిగింది. దీనిని ముద్దుగా ‘అల్లు గార్డెన్స్’ అని పిలుస్తారు. ఆ గార్డెన్ సినిమా విజయాన్నిసెలబ్రేట్ చేసుకోవడంతో  చిత్ర యూనిట్ ఎంతగానో సంబరపడిపోయారు. ప్రకృతి దృశ్యాలతో, పచ్చని పరిసరాలతో, ప్రశాంతంగా ఉండే ఖరీదైన తోటలు మెస్మరైజ్ చేశాయి. ఈవెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశాలమైన వాతావరణం, పచ్చని చెట్లు, మొక్కలతో ఆకట్టుకుంటోంది. అల్లు గార్డెన్ లో విశాలమైన సీటింగ్ ఉంది. సౌకర్యవంతమైన సోఫాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. విలాసవంతమైన ఈత కొలను ఉంది. కుటుంబ సభ్యులు కలిసికట్టుగా ఉండే అల్లు ఇల్లు స్వర్గధామంలా ఉంటుంది.అల్లు అర్జున్ తన పిల్లలతో సెలవు దినాల్లో ఈత కొడుతూ ఉరుకుల పరుగుల జీవితం నుంచి రిలాక్స్ అవుతుంటాడు.

Also Read: Tomato Theft: టమాటా రైతుపై దాడి, 4.5 లక్షలు దోచుకెళ్లిన దుండగుడు